India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఛలో హైదరాబాద్ పేరుతో బీసీ కుల గణన మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ డేటా సైన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

శామీర్‌పేట PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శామీర్‌పేట పరిధి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 2 మృతదేహాలు లభించగా బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మర్కంటి భానుప్రియ(తల్లి), కుమారుడు ఆనంద్ (5), కుమార్తె దీక్షిత (4)గా పోలీసులు గుర్తించారు. పిల్లల అనారోగ్యానికి సంబంధించి భర్తతో గొడవపడిన తర్వాత సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదైంది.

గ్రేటర్ HYD పరిధిలో వ్యర్థాలను తరలించడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం DRF బృందాల పని గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో 80 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.GHMC ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 22 ట్రక్కులు, 8 LMV వాహనాల్లో సేఫ్టీ పరికరాలు, రెస్క్యూ టూల్స్, డీ-వాటరింగ్ పంప్స్, మోటార్లు, ఫైర్ ఫిట్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంచారు.

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ వద్ద <<13875264>>ఆటోను కంటైనర్ ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో గాయపడ్డ ఆటో డ్రైవర్‌తో పాటు విద్యార్థిని సాత్వికను నాచారం ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని సాత్విక మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కాగా హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో సాత్విక పదో తరగతి చదువుతోంది.

రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం 33 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్మించనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ చేస్తోంది. ట్రాన్స్‌జెండర్లకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సంక్షేమ శాఖ ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

HYD నగరంలో పలు ప్రాంతాల నుంచి డైరెక్ట్ మెట్రో స్టేషన్ల పాయింట్ల వద్దకే బస్ సర్వీస్ ప్రారంభించి ఆదాయం పెంచుకోవడంపై మెట్రో దృష్టి పెట్టింది .బెంగళూరులో మెట్రో ఫీడర్ బస్ సర్వీస్ పాయింట్లను పెంచడం ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అదే మోడల్ HYDలో అమలు చేయాలని యోచిస్తోంది. గతేడాది బెంగళూరులో డిసెంబర్ వరకు 65 స్టేషన్లలో రోజుకు 5.60 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం 6.8-7.50 లక్షలకు పెరిగారు.

సైదాబాద్ జువైనల్ హోంలో మత్తు బానిసలుగా మారుతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు ‘మత్తు విముక్తి కేంద్రం’ ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ క్లినిక్‌లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గలవారు www.wdsc.telangana.gov.in వెబ్సైట్ నుంచి లేదా 040-245590480లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

HYD నగరంలో మూసీ ప్రక్షాళన వడివడిగా సాగుతోంది. ముఖ్యంగా ఆక్రమణలను గుర్తించిన అధికారులు ప్రత్యేక యాప్‌లో వివరాలు పొందుపరిచారు. గండిపేట నుంచి ఘట్‌కేసర్ వరకు ఆక్రమణలను గుర్తించారు. రాజేంద్రనగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, బహదూర్‌పుర, నాంపల్లి, అంబర్‌పేట, ఉప్పల్‌లో ఎక్కువ శాతం ఆక్రమణలు ఉన్నట్లు 33 బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకు అన్ని మండలాల్లో కలిపి 12,182 అక్రమణాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు.

HYD, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో HYDRA సంస్థ పని చేస్తోంది. మొత్తం 70 మండలాలు విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీతో పాటు నిజాంపేట, బండ్లగూడ జాగీర్, బడంగ్పేట, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట నగరపాలక సంస్థలు, 30 పురపాలక సంఘాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే HYDలో వణుకు పుట్టిస్తున్న సంస్థ, ఇక కార్పొరేషన్లలోనూ చర్యలు ప్రారంభించనుంది.
Sorry, no posts matched your criteria.