India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాతబస్తీ మెట్రో నిర్మాణంలో వ్యయం తగ్గించేందుకు అధికారులు టెక్నికల్ అంశాలపై ఫోకస్ పెట్టారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా 5.5KM అంటున్నప్పటికీ , ఇప్పటికే మూసీలో 0.3KM మెట్రో రివర్సల్ ఉంది. ఇంకా 5.2KM నిర్మిస్తే సరిపోతుంది. దీంతో కొంత వ్యయం తగ్గించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఆరు స్టేషన్లు ఉండగా, నాలుగు స్టేషన్లకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
HYD నగరం నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అనుగుణంగా రాత్రి వేళల్లో MMTS అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. HYD నగరానికి వచ్చే వందే భారత్ రైళ్లన్నీ రాత్రి 11 గంటల తర్వాతే వస్తున్నాయని.. ఆ సమయంలో ప్రజారవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని HYD నగరానికి 3D చిత్రం రాబోతుంది. గ్రేటర్ విస్తీర్ణాన్ని డ్రోన్లతో రికార్డు చేసి, తద్వారా వచ్చే బేస్ మ్యాప్ పై క్షేత్రస్థాయి సర్వేలో తీసే ఫొటోలు, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని పై GHMC ఐటీ విభాగం భారీ కసరత్తు చేసింది. మొదట ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు,తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు, నగరంలోని ఎత్తుపల్లాలు, నిర్మాణాలను సైతం డిజిటలైజ్ చేయనున్నారు.
అనంతగిరి HYD నగరానికి దాదాపుగా 70.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బయట వాతావరణంతో పోల్చితే ఇక్కడ 5 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత తక్కువే ఉంటుంది. గుహలు, కోటలు, దేవాలయాలు ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అనంత పద్మనాభస్వామి దేవాలయం ఫేమస్. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. మూసీనది పుట్టింది కూడా ఇక్కడే. వేసవి కావడంతో టూరిస్టుల ఇటువైపు మొగ్గుచూపుతున్నారని అధికారులు తెలిపారు.
భార్యభర్తలు గొడవపడి మనస్థాపంలో భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన విశ్రాంత సహాకార ఉద్యోగి ఎన్.సుదర్శన్(63) మలక్ పేట్-కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
✒VKB: సీతారాముల కళ్యాణం మహోత్సవానికి సిద్ధమైన ఆలయాలు
✒కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్
✒రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
✒కొడంగల్: తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
✒రేపు తాండూర్‌లో మాంసం విక్రయాలు బంద్
✒సివిల్స్ ఫలితాల్లో 231 ర్యాంకు సాధించిన పూడూరు మండలవాసి తరుణ్
✒అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు: మహమ్మదాబాద్ ఎస్సై
✓HCA ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు రిజిస్ట్రేషన్ షురూ
✓HYD జిల్లాలో 20వేలకు పైగా మద్యం సీజ్
✓లోక్ సభ ఎన్నికల పై సిపి అవినాష్ మహంతి మీటింగ్
✓ఓయూ ఎంఫార్మసీ ఫలితాలు విడుదల
✓కాంగ్రెస్ పార్టీలో చేరిన డిసిసిబి చైర్మన్ కుర్మ సత్తయ్య
✓వనస్థలిపురంలో పల్టీ కొట్టిన ఆటో
✓మధ్యాహ్నం 12 నుంచి 4PM వరకు గ్రేటర్లో పరిమితంగా ఆర్టీసీ బస్సులు
✓పేట బషీరాబాద్ పరిధిలో మర్డర్
జువైనల్ హోమ్(బాలికల సదన్) నుంచి ఓ బాలిక పారిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన హనుమంతు కుమార్తె ప్రియగిరి(17)ని కాచిగూడలోని బాలికల సదన్‌కు 2023 జనవరిలో తీసుకువచ్చారు. మంగళవారం బాలికల సదన్ నుంచి గోడ దూకి పారిపోయింది. సూపర్ వైజర్ సావిత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ప్రియులకు ‘HYD క్రికెట్ అసోసియేషన్’ శుభవార్త తెలిసింది. ఇప్పటికే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ‘HCA అధ్యక్షులు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈనెల 18 వరకు https://www.hycricket.org/data-2024-25/summer-camp-apr-2024/sc-regn.html వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. SHARE IT
HYD జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.13.75 కోట్ల నగదు, దాదాపు 20,000 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 171 మంది పై కేసులు నమోదు చేసి 163 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇతర వస్తువులపై 348 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించారని, 227 మంది పై FIR నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు 2,711 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.