India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జులై ఏడో తేదీన పోరుయాత్ర చేపట్టబోతున్నామని, అదే నెల 15న కమిషనరేట్‌ను ముట్టడిస్తామని మాజీ MLC చెరుపల్లి సీతారాములు ప్రకటించారు. HYDలో తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్, చేనేత కార్మికుల సంఘం సంయుక్త సమావేశం జరిగింది. ఉపాధి దొరక్క, వస్త్రపరిశ్రమై ఆధారపడ్డ చేనేత, పవర్‌లూమ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HYD విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వచ్చేసారి ప్రధాని అవ్వడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడని కొనియాడారు. విద్యావంతుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి అని అన్నారు. భారత్ జోడో యాత్రతో తన సత్తా ఏంటో దేశానికి చూపించారని పేర్కొన్నారు.
HYDలో మరో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సనత్‌నగర్ పరిధి ఏజీ కాలనీలోని నేతాజీనగర్ వాసి అజార్(22), ఎర్రగడ్డ వాసి ఆసిఫ్ (23) తోడు దొంగలు. రాత్రి ఇద్దరు మద్యం తాగి భరత్‌నగర్ MMTSరైల్వే స్టేషన్ వెనుక పొదల్లోకి వెళ్లారు. ఇటీవల చేసిన చోరీకి సంబంధించి సొత్తు పంపకాల విషయంలో వారు ఘర్షణ పడ్డారు. అజార్‌ను ఆసిఫ్ కత్తితో పొడిచి రాళ్లతో తలపై కొట్టి చంపి పరారయ్యాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఓ యువకుడిపై HYDకాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. CIలక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమాకు చెందిన యువతి(28) చిక్కడపల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది. లక్డీకపూల్ వాసి విశాల్(27) ప్రైవేటు ఉద్యోగి. వారిద్దరూ 2016నుంచి లవ్ చేసుకుంటున్నారు. కాగా ఆమెను కాదని మరొకరిని అతడు ఇటీవల వివాహం చేసుకున్నాడు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లాడ్జిలో అత్యాచారం చేశాడని బుధవారం ఆమె PSలో ఫిర్యాదు చేసింది.
HYD రవీంద్రభారతిలో బుధవారం శ్రీరామనాటక నికేతన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురువు మంజులా రామస్వామి మనువరాలైన వన్సిక సుదర్శన్ భరతనాట్యంలో అరంగేట్రం చేసింది.గణేశ స్తుతి, పాద వర్ణం,శంకర శ్రీగిరి, విషమకర, తిల్లాన తదితర అంశాల్లో నర్తించి భళా అనిపించింది. నట్టువాంగంపై గురువు మంజుల రామస్వామి, గణేశ్ గానం చేయగా, మృదంగంపై రాజగోపాలచారి,వయొలిన్‌పై సాయికుమార్, ఫ్లూట్‌పై దత్తాత్రేయ వాయిద్య సహకారం అందజేశారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ వీటిని అందించాలని కలెక్టర్లు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు DMHO, AMHO అధికారులు వీటిని అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ప్రసిద్ధి గాంచిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం పటిష్ఠ బందోబస్తు నడుమ అధికారులు బుధవారం నిర్వహించారు. మార్చి 30 నుంచి జూన్ 19 వరకు మొత్తం 81 రోజులకు గాను సాధారణ హుండీల్లో నోట్లు రూ.87,15,384, నాణేలు రూ.3,53,449.. మొత్తం రూ.90,68,833 వచ్చాయి. అన్నదానం హుండీలో రూ.1,60,686 రాగా మొత్తం ఆదాయం రూ.92,29,521 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్‌ను ఈనెల 23న నిర్వహిస్తున్నట్టు తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలోని యోగా హాల్‌లో అండర్-7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు జరుగుతాయని, ఆసక్తి గల వారు 7337578899, 7337399299 ఫోన్ నంబర్లకు వాట్సాప్‌లో తమ వివరాలు పంపించి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఆక్రమణలతో గోల్కొండ కోట ప్రతిష్ఠ మసకబారుతోంది. చట్టం ప్రకారం పురాతన కట్టడం నుంచి సుమారు 300 మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ గోల్కొండలో మాత్రం ఆక్రమణదారులు ఇష్టానుసారం గోడలు కూల్చేసి భవనాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు కోట చుట్టూ వ్యర్థాలు, జంతు కళేబరాలు పారేయడం, మూత్ర విసర్జన చేస్తుండడంతో ప్రపంచ వారసత్వ హోదా కలగానే మారింది.
Sorry, no posts matched your criteria.