India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మం. కుంట్లూరు రెవెన్యూ పరిధి భూదాన్ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. CPI రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు, నాయకులు జంగయ్య, రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, పర్వతాలు CMని కలిసి వినతి పత్రం అందించారు. ఈ వ్యవహారంపై ఆయన సానుకూలంగా స్పందించారని కూనంనేని వెల్లడించారు.
HYD చిలకలగూడ PS పరిధిలో దారుణం జరిగింది. CI అనుదీప్ కథనం ప్రకారం.. లాలాగూడకు చెందిన ఓ మహిళ 2022లో అనారోగ్యంతో చనిపోయింది. ఆమె కూతురు(12)ను సోదరి గార్డియన్‌గా పెంచుకుంటుంది. మల్కాజిగిరి వాసి సాయికృష్ణ(25)బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. చిల్డ్రన్ హోమ్ నుంచి తన ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి రేప్ చేశాడు. సాయికృష్ణతో పాటు అతడికి సహకరించిన చిల్డ్రన్ హోమ్ వర్కర్ లక్ష్మీపై కేసు నమోదైంది.
HYD మరోసారి దేశవ్యాప్తంగా సత్తాచాటింది. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కలుపు యాజమాన్య విభాగానికి అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ సెంటర్ అవార్డు దక్కడం విశేషం. భువనేశ్వర్‌లో అఖిల భారత కలుపు యాజమాన్య సంస్థ వార్షిక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి HYD సైంటిస్టులు డాక్టర్ రామ్ ప్రకాశ్, డాక్టర్ పద్మజ ఈ అవార్డు అందుకొన్నారు.
SHARE IT
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూర్ నుంచి కొడంగల్ వెళ్లే ప్రధాన రహదారిలో (కాగ్న వంతెన సమీపంలో) లారీ బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్‌నగర్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూపార్కు పరిసరాల్లో వాయు, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉద్ధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని షర్మిల అన్నారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్రేటర్ వ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ తాగునీటి, మురుగు కనెక్షన్లకు యాప్‌తో అరికట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ యాప్‌ను విజయవంతంగా పరిశీలించిన అధికారులు నగర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొన్నేళ్లుగా అక్రమ నల్లాలు, మురుగునీటి కనెక్షన్ల వల్ల జలమండలికి నష్టం జరుగుతోంది. అక్రమ కనెక్షన్లను అరికట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
HYDలో భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. వరుస చైన్ స్నాచింగ్‌లకు ముఠా పాల్పడటంతో పోలీసులకు సవాలుగా మారింది. HYDతో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా స్నాచింగ్‌లు చేస్తున్నారు. జవహర్‌నగర్, శామీర్ పేట, మెహిదీపట్నంలో చైన్ స్నాచింగ్ చేసి శివారు ప్రాంతాల్లోకి గ్యాంగ్ మకాం మార్చడంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
HYD నగరంలోని కొత్తపేట, అల్వాల్, సనత్ నగర్‌లో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ మూడు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై భారం తగ్గనుంది. అత్యాధునిక వసతులతో, నూతన టెక్నాలజీ ఉపయోగించి రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపడుతోంది. ప్రత్యేక ఇంజినీర్ల బృందం నాణ్యతపై ఇటీవల చెకింగ్ చేసింది.
HYD నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పల్, చంద్రాయణగుట్ట, మల్లాపూర్, నాచారం, రాజేంద్రనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వయంగా ఆహార నాణ్యతను పరీక్షించే యంత్రాలను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అక్కడికక్కడే పరీక్షిస్తున్నట్లు FSO పవన్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇటీవల వేగవంతం చేశామని, ప్రమాణాలకు విరుద్ధంగా ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే నిబంధనల ప్రకారం హోటళ్లను మూసివేస్తామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.