RangaReddy

News June 19, 2024

HYD: భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్!

image

HYDలో భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. వరుస చైన్ స్నాచింగ్‌లకు ముఠా పాల్పడటంతో పోలీసులకు సవాలుగా మారింది. HYDతో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా స్నాచింగ్‌లు చేస్తున్నారు. జవహర్‌నగర్, శామీర్ పేట, మెహిదీపట్నంలో చైన్ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లోకి గ్యాంగ్ మకాం మార్చడంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

News June 19, 2024

HYD నగరంలో వేగంగా ఆసుపత్రుల నిర్మాణం!

image

HYD నగరంలోని కొత్తపేట, అల్వాల్, సనత్ నగర్‌లో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ మూడు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై భారం తగ్గనుంది. అత్యాధునిక వసతులతో, నూతన టెక్నాలజీ ఉపయోగించి రూ.కోట్లు  వెచ్చించి ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపడుతోంది. ప్రత్యేక ఇంజినీర్ల బృందం నాణ్యతపై ఇటీవల చెకింగ్ చేసింది.

News June 19, 2024

HYD: హోటల్, రెస్టారెంట్లకు హెచ్చరిక.. తేడా వస్తే అంతే..!

image

HYD నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పల్, చంద్రాయణగుట్ట, మల్లాపూర్, నాచారం, రాజేంద్రనగర్ లాంటి అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వయంగా ఆహార నాణ్యతను పరీక్షించే యంత్రాలను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అక్కడికక్కడే పరీక్షిస్తున్నట్లు FSO పవన్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇటీవల వేగవంతం చేశామని, ప్రమాణాలకు విరుద్ధంగా ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే నిబంధనల ప్రకారం హోటళ్లను మూసివేస్తామని హెచ్చరించారు.

News June 19, 2024

HYD: ఇంటి అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య

image

ఇంటి అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచుపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తూర్పు గోదావరికి చెందిన వరప్రసాద్ (45) రియల్ ఎస్టేట్ వేస్తూ భార్య శైలజ, కుమారుడితో కలిసి వసంతనగర్ కాలనీలో ఉంటున్నాడు. 3 నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. తన భార్య పోచారం వెళ్లిన సమయంలో ఉరేసుకున్నాడు. కాగా ఇంటి యజమానురాలు అద్దె కోసం వేధించడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 19, 2024

HYD: NIMS ఆసుపత్రిలో ఏ రోజు.. ఏ సేవలు..?

image

HYD నగరంలోని NIMS ఆస్పత్రిలో వైద్య సేవల లిస్టును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు చర్మ సంబంధ వ్యాధులు, జీర్ణాశయ సంబంధ వ్యాధులు, మహిళా సంబంధిత వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్ సేవలు సైతం సోమవారం నుంచి శనివారం వరకు అందిస్తామన్నారు. మిగతా అవుట్ పేషెంట్ సేవల లిస్టును పట్టికలో చూడొచ్చు.

News June 18, 2024

HYD: 5TH ఫ్లోర్‌లో ఫ్రెండ్స్‌తో పార్టీ.. ఇంతలోనే విషాదం!

image

HYD చిలకలగూడ PS పరిధిలో ప్రమాదం జరిగింది. బంగ్లాపై నుంచి పడి ఇంటర్ స్టూడెంట్ మృతి చెందారు. SI జ్ఞానేశ్వర్​ కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన రాపోలు సురేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇంటర్​ చదువుతున్న ఒక కుమారుడు రాహుల్​ (17) ఉన్నారు. రాహుల్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి భవనంపైకి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్​ నుంచి ఒకటో ఫ్లోర్‌లో పడి​ తీవ్రగాయాలతో చనిపోయాడు. కేసు నమోదైంది.

News June 18, 2024

శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు‌కు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ ఆగంతకుడు బాంబు పెట్టామని లేఖ పంపాడు. మెయిల్ చూసిన అధికారులు భద్రత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎయిర్ పోర్ట్‌లో తనిఖీలు చేసిన సిబ్బంది అది ఆకతాయి పని అని తేల్చారు. మెయిల్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్కసారిగా సిబ్బంది తనిఖీలు చేయడంతో ప్రయాణికులు కాస్త కంగారు పడ్డారు.

News June 18, 2024

HYD: సీతారాముల విగ్రహాల ధ్వంసంపై RSS, VHP, బజరంగ్‌దళ్ ఆందోళన

image

మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామంలోని హనుమాన్ గుట్టపై ఉన్న సీతారాముల ఆలయంలో దుండగులు <<13461450>>విగ్రహాలను ధ్వంసం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న RSS, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

HYD: పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు రెడీ

image

ఎత్తిపోతల ద్వారా HYD నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి అత్యవసర పంపింగ్‌తో నగరానికి రోజూ 168 ఎంజీడీల వాటర్‌ను తరలించనున్నారు. ఈ సందర్భంగా ఏడు పంపులను అధికారులు సిద్ధం చేసి ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

News June 18, 2024

HYD: ‘RRR’@ రూ.31 వేల కోట్లు..!

image

HYD రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే దీనికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2 భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్నట్లు లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లాలని నిర్ణయించారు. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై NHAI అధికారులు చర్చలు జరుపుతున్నారు.