India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంతో వయోజనులు, గృహిణులు కనీస విద్యార్హతలైన పదో తరగతి, ఇంటర్ సాధించేందుకు ఈ విధానం ఎంతో సహకరిస్తుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అంతర్జాల కేంద్రాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రవేశాలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 10వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

HYD నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జులైలో 22.6 లక్షల మంది ప్రయాణించారు. గత ఏడాది కంటే 13% ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుందని పేర్కొన్నారు. భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, నూతన వసతులను కల్పించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 25 అర్జీలు రాగా, టెలిఫోన్ ద్వారా 4 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

డెలివరీ చేసిన కండక్టర్ జి.భారతిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. RTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపోనకు చెందిన మహిళా కండక్టర్ జి.భారతికి తన అభినందనలు అంటూ కొనియాడారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి సీతక్క సోమవారం రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి సీతక్కతో పాటు నారాయణపేట, సత్తుపల్లి శాసనసభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయిలు తదితరులు రాఖీలు కట్టారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగానగర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సోదరుడిలా అన్నివేళలా తనకు అండగా ఉంటానన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మహిళలకు అన్నివేళలా రక్షణగా ఉంటుందన్నారు.

అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని గాంధీభవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోదర బంధం విలువ వెలకట్టలేనిదన్నారు.

ప్రజావాణికి వచ్చే సమస్యలను శాఖల వారీగా అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి ప్రజావాణికి వచ్చిన సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కౌన్సిల్ అధ్యక్షుడు రంగయ్య మీడియాతో మాట్లాడారు. నెల కింద ఏర్పాటైన హైడ్రా అద్భుతాలు చేస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
Sorry, no posts matched your criteria.