RangaReddy

News April 15, 2024

వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలపై ఇక్రిశాట్ ఫోకస్

image

వేరుశనగ సాగులో ఫంగల్ సమస్యలకు చెక్ పెట్టి దిగుబడులను పెంచేందుకు HYD శివారులోని ఇక్రిశాట్ కృషి చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని వివిధ శీతోష్ణ, భూసార పరిస్థితులను ఆధారంగా చేసుకుని అప్లోటాక్సిన్-ఆస్పిరిజెల్లాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. తద్వారా రైతులు పంట పండించే ఖర్చు సైతం తగ్గుతుందన్నారు.

News April 15, 2024

HYD: రూ.13.72 కోట్ల నగదు సీజ్‌

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్డ్‌ బృందాలు HYD నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ.13.72 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్ తెలిపారు.

News April 15, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

HYD దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 15, 2024

HYD: పదో తరగతి బాలికపై అత్యాచారం

image

బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాదన్నపేటలోని చంద్రాహట్స్‌కు చెందిన రాజేందర్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పొక్సో కేసు నమోదు చేశారు.

News April 15, 2024

చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్ల రాకపోకలు!

image

లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం కృష్ణా ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్, శాతవాహన ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

News April 15, 2024

HYD: కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ తయారీ!

image

HYD తార్నాక IICT సైంటిస్టులు కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాడ్మియం సల్ఫైడ్, సెమీకండక్టర్లతో కూడిన ఆకుల పై సూర్యరశ్మి పడిన వెంటనే కాడ్మియం ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయనిక చర్య జరుగుతుందని, తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుందని, చాలా తక్కువ ఖర్చుతో పారిశ్రామిక అవసరాలకు హైడ్రోజన్ తయారు చేసుకోవచ్చన్నారు.

News April 15, 2024

HYD: MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో నూతన వసతులు

image

HYD నగరంలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతన వసతులను కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దవాఖానను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆసుపత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు వేచి ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు అత్యధిక రోబోటిక్ శస్త్ర చికిత్సలు, కీమోతెరపి, స్కానింగ్ సహా అనేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

HYD: కంటోన్మెంట్ చరిత్రలోనే ఇది రెండవ ఉపఎన్నిక..!

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలోనే మే 13వ తేదీన జరగనున్న ఎన్నిక రెండో ఉప ఎన్నిక. 1957లో ఆవిర్భవించిన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1969లో అప్పటి ఎమ్మెల్యే రామారావు మృతితో తొలిసారిగా ఉపఎన్నిక జరిగింది. 2024లో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మే 13న రెండో ఉప ఎన్నిక జరగనుంది. BRS నుంచి లాస్య నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ బరిలో ఉండగా.. బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.

News April 14, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD,RR,MDCL,VKB జిల్లాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
✓HYDలో అంబేద్కర్‌కు అవమానం: గంటా చక్రపాణి
✓ఆగస్టు చివరి నాటికి మూసి మాస్టర్ ప్లాన్ సిద్ధం
✓శంషాబాద్ ఫామ్ హౌస్ పై పోలీసుల రైడ్స్
✓ప్రజా పోరాటంతో తెలంగాణ సాధించాం:KTR
✓కొంపల్లి: నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య
✓హిమాయత్ సాగర్ అడుగున వ్యర్ధాలు
✓VKB జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీలు నమోదు.

News April 14, 2024

HYDలో అంబేడ్కర్‌కు అవమానం: గంటా చక్రపాణి

image

డా.బీఆర్‌ అంబేడ్కర్ జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించిందని TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, BRS సోషల్ మీడియా నేత చందు షేక్స్ విమర్శించారు. సచివాలయం పక్కనే ఉన్న భారీ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించలేదని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఇలాంటి ప్రతీకారాలు రాజకీయాల్లో ఒకే, కానీ రాజ్యాంగ ప్రాధాత, జాతిపితతో వద్దు అంటూ గంటా చక్రపాణి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.