RangaReddy

News April 14, 2024

HYD: ఆగస్టులోనే మాస్టర్‌ ప్లాన్!

image

HYD నగరంలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. డీపీఆర్, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించారు. 2024 ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని MRFDC ఎండీ ఆమ్రపాలి చెప్పారు. మొదటిదశలో ఉస్మాన్‌సాగర్ నుంచి గౌరెల్లి ORR, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55KM మూసీ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు.

News April 14, 2024

HYD: ప్రజా పోరాటంతో తెలంగాణ సాధించాం: KTR

image

KCR సారథ్యంలో విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజల పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. HYD తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు స్ఫూర్తితోనే కేసీఆర్ 14 ఏళ్లు ముందుండి తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు.

News April 14, 2024

నివాళి: జార్జ్ రెడ్డి హత్యకు నేటికి 52 ఏళ్లు

image

‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి దేశవ్యాప్తంగా సుపరిచితుడు. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1962‌‌లో జార్జ్ ఫ్యామిలీ నగరంలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్.. OUలో పీజీ చేశారు. యూనివర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే దారుణంగా హత్యచేశారు. నేడు జార్జ్ 52వ వర్ధంతి.

News April 14, 2024

HYD: 10TH పాసైన వారికి సువర్ణ అవకాశం 

image

HYD బాలానగర్‌లోని CITDలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10వ తరగతి పాసైన వారు మే 13 వరకు https://citdindia.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ మౌల్డ్ మేకింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ బ్రాంచీలు ఉన్నాయి.

News April 14, 2024

HYD: హుస్సేన్ సాగర్‌లో తగ్గిన బోట్ షికారు 

image

HYD హుస్సేన్ సాగర్‌లో బోట్ షికారు చేసే వారి సంఖ్య తగ్గింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బోట్ షికారు చేసిన వారు 2 వేల మంది వరకు ఉండగా.. శని, ఆదివారాలు 5 వేల మంది ఉంటున్నారు. సాగర్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు 100 మంది సామర్థ్యం ఉన్న పెద్ద బోట్లలో పుట్టిన రోజు వేడుకలు, కుటుంబ సభ్యుల సమావేశాలు జోరుగా సాగేవి. ఓ వైపు ఎండ, మరోవైపు హుస్సేన్ సాగర్ దుర్వాసన కారణంగా షికార్ చేసే వారి సంఖ్య తగ్గింది.

News April 14, 2024

BREAKING: HYD: విద్యార్థి SUICIDE

image

నీట్ పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఈరోజు జరిగింది. స్ప్రింగ్ కాలనీలో ఉంటున్న జైస్వాల్(22) నీట్ పరీక్షపై ఆందోళనకు గురై.. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2024

HYD: హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు!

image

HYD హిమాయత్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 2.128 టీఎంసీలు ఉండగా.. నగరానికి 26 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం అడుగులో కలుషితాలు పేరుకుపోవడంతో 10 అడుగులపై నుంచి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. పంపింగ్ ద్వారా నేరుగా మీర్ ఆలం నీటి శుద్ధి కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేయనున్నారు. హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు వస్తున్నట్లు గుర్తించారు.

News April 14, 2024

HYD: EMERGENCY పంపింగ్‌కు చర్యలు

image

HYDలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఈనెల 15 నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్ మెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.

News April 14, 2024

HYD: పిల్లలను షాప్‌కు పంపుతున్నారా.. జర జాగ్రత్త!

image

అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఆరేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మలక్‌పేట్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సలీంనగర్ వాసి సుబ్బారావు(52)కు ముసారాంబాగ్‌లో కిరాణా షాప్ ఉంది. దుకాణానికి వచ్చిన ఓ చిన్నారి(6)తో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.

News April 14, 2024

HYD: తిరుపతి వెళ్లేవారే TARGET.. జర జాగ్రత్త..!

image

తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్‌గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్‌కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.