RangaReddy

News June 15, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✓గచ్చిబౌలి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క
✓KCR పై కుట్రలను సహించబోము :BRSV
✓HYD: రూ.1.83 కోట్ల విలువైన మద్యం సీసాలు ధ్వంసం
✓ఈ నెల 17న ప్రజావాణి లేదు:GHMC కమిషనర్
✓రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్
✓ఉప్పల్:చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొక్కు తీర్చుకున్న నేతలు
✓HYD: నిజాం కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

News June 15, 2024

HYD: అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

image

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎస్ఎల్‌వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువర్యులు చింత నాగార్జున శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కర్ణాటక గాత్ర కచేరీలో చూడమ్మా సతులారా, భో శంభో, వేంకటేశుడు, తరతరాల తిరుమల, స్వాగతం కృష్ణ, గోదావరి అంశాలను కళాకారులు ఆలపించారు. నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.

News June 15, 2024

BREAKING: HYD: నిజాం కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

image

ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌కు చెందిన రవి HYDతార్నాకలోని ఓయూ హాస్టల్‌లో ఉంటూ నిజాం కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి అతడు దూకగా శబ్దం విన్న తోటి విద్యార్థులు వెంటనే వచ్చి రవిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

News June 15, 2024

HYD: ఈనెల 17న ప్రజావాణి లేదు: GHMC కమిషనర్

image

HYD ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 17న ఉండదని GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఈరోజు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రజావాణి ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

News June 15, 2024

HYD: రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్

image

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.

News June 15, 2024

HYD: రీజినల్ రింగ్ రోడ్డు పొడవు పెరిగింది..!

image

HYD ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా తాజా ఎలైన్‌మెంట్‌తో RRR ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. దీంతో రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. అయితే గతంలో 340.51 కి.మీ. నిర్ణయించగా ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానం కోసం ఈ మార్పు అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ సేకరణ చేయనున్నారు.

News June 15, 2024

HYD: మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా!

image

ఆదాయం పెంపు దిశగా జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత సర్కారు 2021లో జీవో నెం.102 ద్వారా 118 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చింది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. మరో వంద రోడ్లకు ఆ హోదా ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 100 అడుగులు, అంతకన్నా ఎక్కువ వెడల్పున్న రోడ్లకు ఇచ్చారు.

News June 15, 2024

HYD: ప్రాణాన్ని బలి తీసుకున్న పందేలు

image

పందేలు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. చెందిప్పకు చెందిన సురేందర్(45) ఈనెల 1న గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సురేందర్ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా మాట్లాడుకున్న స్నేహితులు పురుగు మందు తాగితే రూ.లక్ష ఇస్తామని సురేందర్‌తో పందెం కాశారు. దీంతో నిజంగానే పురుగు మందు తాగిన సురేందర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 15, 2024

HYD: ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’

image

వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం.. బైకును ఢీకొట్టడంతో జగ్గప్పకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే గాయాలతో పడి ఉన్న తండ్రికి కొడుకు బ్రూస్లీ ధైర్యం చెప్పాడు. ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’ అంటూనే కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్థానికులతో కలిసి తండ్రిని ఆస్పత్రికి తరలించే సమయంలో జగ్గప్ప తల నుంచి రక్తం రావడంతో బట్టతో అదిమి పట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

News June 15, 2024

ఓయూ: బీఈడీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.