RangaReddy

News June 15, 2024

హైదరాబాద్‌లో నేటి నుంచి డయల్ యువర్ ఎండి

image

జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు సమస్యలను తెలుసుకుంటామన్నారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ఇతర సమస్యలపై 23442881, 23442882, 23442883 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

News June 15, 2024

భూ వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్: పొంగులేటి

image

రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హడావిడిగా, అధ్యయనాలు ఏవీ లేకుండా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్, మధుసూదన్‌లతో మంత్రి భేటీ అయ్యారు.

News June 15, 2024

KPHB: లులు మాల్‌కు తాఖీదులు 

image

అక్రమ మురుగు కనెక్షన్లపై జలమండలి దృష్టి సారించింది. KPHBలో తనిఖీలు ముమ్మరం చేసి లులు మాల్‌కు కనెక్షన్ లేదని గుర్తించి నోటీసులు జారీ చేశారు. లులు మాల్‌కు ముందు మంజీరామాల్-మంజీరా మెజిస్టిక్ హోమ్స్‌కు కలిపి ఒకటే ఏస్టీపీ ఉండేది. వేరుగా కనెక్షన్ తీసుకోవాలని మంజీరామాల్‌‌కు గతంలో జలమండలి అధికారులు తాఖీదులు ఇచ్చారు. ఇలా ఒకే కనెక్షన్‌తో ఏళ్లుగా జలమండలి రెవెన్యూ తగ్గిందని మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

News June 15, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్(24) కొత్తగూడ నీలం మెన్స్ పీజీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైకుపై వెళ్తూ మరో బైకును ఢీకొట్టాడు. ఇద్దరు కిందపడగా మనోజ్ తలకు గాయాలై మృతి చెందాడు. మరో బైకుపై ఉన్న సాయి(23)కి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 15, 2024

సికింద్రాబాద్: ఆలస్యంగా విశాఖ.. ప్రయాణికుల తిప్పలు!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే విశాఖ రైలు పలుమార్లు ఆలస్యంగా రావడం పట్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. విశాఖ రైలు సమయపాలన పాటించేలా రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. ఒక్కోసారి రెండు గంటలకు పైగా ఆలస్యం జరుగుతుందని, అలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

News June 15, 2024

HYD: మాత్రలు వికటించి వ్యక్తి మృతి

image

మద్యం మత్తులో అధిక మొత్తంలో జ్వరం మాత్రలు వేసుకున్న వ్యక్తి మాత్రలు వికటించి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్‌ మండలంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేశ్‌(32) జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న జ్వరం మాత్రలను అధిక మొత్తంలో వేసుకున్నాడు. దీంతో మాత్రలు వికటించి మల్లేశ్‌ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 15, 2024

నిరుపేద తల్లిదండ్రులకు సాయం అందించాలి: కలెక్టర్‌

image

విద్యారుణ శిబిరాలు నిర్వహించి నిరుపేద తల్లిదండ్రులకు తక్షణమే సాయం అందించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల వారీగా రుణ లక్ష్యాలు, సాధించడంపై సమీక్షించారు. 2023-24లో జిల్లాలో విద్యారుణాలు రూ.1203.84 కోట్లు లక్ష్యంగా ఉండగా.. ఇప్పటివరకు రూ. 131.95 కోట్లు (10.96%) ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News June 15, 2024

HYD: యువతులను వేధిస్తే తాటతీస్తాం: సీపీ

image

బాలికలను, యువతులను, మహిళలను వేధించే పోకిరీలను షీటీమ్స్‌ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డా.తరుణ్ జోషి తెలిపారు. నేరేడ్‌మెట్‌లో ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీటీం డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తుందని, వేధింపులకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు.

News June 15, 2024

HYD: నేడు డ్రైవర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు

image

ఈఎంఆర్ఐ సంస్థలో పైలెట్ (డ్రైవర్) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రొగ్రామ్ మేనేజర్ షేక్ జనాహీద్ తెలిపారు. ఈనెల 15వ తేదీన HYD కోఠి రీజినల్ కార్యాలయంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 నుంచి మ.3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. 10వ తరగతి అర్హతతో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ సెట్ వెంట తీసుకొని రావాలన్నారు. SHARE IT

News June 14, 2024

HYD: యూసుఫ్‌గూడ యాక్సిడెంట్‌లో చనిపోయింది ఈమెనే..!

image

HYD మధురానగర్ PS పరిధి యూసుఫ్‌గూడలో ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఇంటర్ <<13439494>>విద్యార్థిని మెహరీన్‌<<>> చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తమతో ఉన్న ఫ్రెండ్ చనిపోయిన విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విగత జీవిగా ఉన్న మెహరీన్‌ను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రయాణికులూ.. బస్సు దిగేటప్పుడు జర జాగ్రత్త!