India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నీట్ ఫలితాల అవకతవకాలపై విచారణ జరిపించాలని కోరుతూ SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య పార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు మాట్లడుతూ.. నీట్ ఫలితాల అవకతవకాలపై కేంద్రం స్పందించకుండా, గ్రేస్ మార్కులు పొందిన వారి స్కోర్ కార్డులు రద్దు చేసి, వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడం అంటే నీట్ అవకతవకలు పక్కదారి పట్టించడమే అని అన్నారు.
తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం HYDలోని బస్‌భవన్‌ను సందర్శించారు. టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వారు అధ్యయనం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మీ పథకం అమలుపై వివరాలు తెలిపారు.
HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ <<13435343>>సీహెచ్.సుధాకర్<<>> గురువారం రూ.3లక్షలు లంచం తీసుకుంటుండగా ACBఅధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకుని అందులో మొదట విడతగా రూ.5లక్షలు తీసుకున్నాడు. మరో రూ.3లక్షలు తీసుకుని పారిపోతుండగా ఛేజ్ చేసి అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం సుధాకర్‌ని విచారణ చేసి, నాంపల్లి ACB కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించింది.
అదృశ్యమైన ఓ బాలిక ఘటన విషాదాంతంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD మియాపూర్ నడిగడ్డ తండాలో గత శుక్రవారం బానోతు వసంత(12) అనే బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అదృశ్యమైన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఈరోజు బాలిక మృతదేహం లభ్యమైంది. హత్య చేశారా? లేదా వేరే కారణం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
HYD ప్రజాభవన్ ఇన్‌ఛార్జ్ సంగీతతో పాటు చిన్నారెడ్డికి ఈరోజు గురుకుల అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందిన అభ్యర్థులు వినతి పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాము అపాయింట్‌మెంట్ లెటర్స్ తీసుకున్నామని, ఇప్పటివరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు.అనంతరం నాంపల్లిలోని ట్రెబ్ ఛైర్మన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం చేయాలని కోరారు.
జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని BJP రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం HYD హైదర్‌గూడలోని NSSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అన్నారు.
HYD శివారులోని 7కార్పొరేషన్లు, 21మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి రాజధాని పరిధిని పెంచేందుకు MDCL, RRఅధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా CMరేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. జవహర్‌నగర్, ఘట్‌కేసర్, కొంపల్లి, మేడ్చల్, దుండిగల్, బడంగ్‌పేట్, శంషాబాద్, ఆదిభట్ల, పెద్దఅంబర్‌పేట్, బోడుప్పల్, నాగారం, దమ్మాయిగూడ, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్ తదితర ప్రాంతాలు విలీనం కానున్నాయి.
త్వరలో జరగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులను 1:50 గా కాకుండా 1:100గా ఎంపిక చేయాలని పలువురు నిరుద్యోగులు ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. 1:100కి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతందన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ CM దృష్టి తీసుకెళుతానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
వర్షాకాలంలో మెట్రో రైలు సేవల్లో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం బేగంపేటలో L & T HYD మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్ తదితరులతో ఎండీ NVSరెడ్డి సమావేశమయ్యారు. ట్రాన్స్ కో ఫిడర్ ట్రిప్ అయితే ప్రత్యామ్నాయంగా మరొక ఫీడర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. నీటి పైపులను క్లీన్ చేయడం, జాయింట్ల తనిఖీ, ఎస్కలేటర్ల వద్ద నీరు నిలువకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
గ్రూపు-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా HYD కాచిగూడలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-2 ఎక్సైజ్ ఎస్ఐ ఎత్తు 167.6 నుంచి 165కు తగ్గించాలని, డీఎస్సీ పరీక్షను ఆఫ్ లైన్‌లో నిర్వహించాలని కోరారు. ఎంతో మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.