RangaReddy

News June 13, 2024

HYD, RR, MDCLలో వర్షపాతం వివరాలు..

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ మోస్తారు వర్షం కురిసింది. అధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగళ్‌పల్లిలో 74.5 మిల్లీమీటర్లు, మొయినాబాద్ 55.8, సైదాబాద్ 41, చార్మినార్ 39.8, బండ్లగూడ 30, అంబర్‌పేట్ 28.5, సరూర్ నగర్ 22.3, బహదూర్‌పుర 18.8, నాంపల్లి 17.8, మల్కాజిగిరి 11.8, మారేడ్‌పల్లి 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

News June 13, 2024

HYD: ‘రెసిడెన్షియల్ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చొద్దు’

image

తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నంద గోపాల్ గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను HYDలో కలిసి విజ్ఞప్తి చేశారు.

News June 13, 2024

BREAKING: HYD: లంచం తీసుకుంటూ దొరికిన సీఐ 

image

HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సుధాకర్‌ ఈరోజు రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసుకు సంబంధించి అతడికి అనుకూలంగా విచారణ చేసేందుకు రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకోగా ఈరోజు మరో రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని వెల్లడించారు. 

News June 13, 2024

HYD: పంజాగుట్టలో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు HYD పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి దాడులు చేశారు. నిర్వాహకురాలు సూర్యకుమారి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.89వేల నగదు, 18 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 13, 2024

HYD: అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం

image

రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఈరోజు HYD ఖైరతాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బ్లడ్ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

News June 13, 2024

HYD: GET READY.. మరో 2 గంటలు భారీ వర్షం

image

HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. SHARE IT

News June 13, 2024

HYD: అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. మిస్ అవ్వకండి..!

image

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు(2025) సన్నద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ HYD రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://studycircle.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. SHARE IT

News June 13, 2024

HYD: నగరంలో భయంకరమైన ముఠా!

image

రాత్రి సమయంలో హయత్ నగర్ శివారు రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో ధార్ అనే భయంకరమైన ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ గ్యాంగ్ ఐదుగురికి పైగా దొంగల ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాల్లో రాత్రి దొంగతనాలు చేస్తారు. ఇంట్లోకి ప్రహరీ ద్వారా ప్రవేశించి డోర్ కొట్టి ఇంట్లో వారిని హత్య చేసి మరీ దోచుకెళ్తారని పోలీసులు చెప్పారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News June 13, 2024

కూకట్‌పల్లి: ముగిసిన ఈ-సెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జేఎన్‌టీయూ ప్రవేశాల విభాగంలో జరుగుతున్న మొదటి ఫేజ్ ఈ-సెట్ ధ్రువ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. చివరి రోజు మొత్తం 480 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 450 మంది హాజరయ్యారని ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ రావు తెలిపారు. రెండో ఫేజ్ ధ్రువపత్రాల పరిశీలన వచ్చే నెల 17 నుంచి మొదలవుతుందన్నారు. మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిన సీట్ల భర్తీ రెండో ఫేజ్‌లో జరుగుతుందన్నారు.

News June 13, 2024

HYD: బాలికపై లైంగిక దాడి.. అరెస్ట్

image

ఓ బాలికను లైంగికంగా వేధించి, చివరికి బెదిరింపులతో తన వాంఛను తీర్చుకున్న వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం..నారాయణగూడ PS పరిధిలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలికను హిమాయత్ నగర్ నివాసి ప్రియదర్శి కుమార్ సైగల్ కొంత కాలంగా లైంగికంగా వేధించాడు. మూడు సార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రియదర్శికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.