RangaReddy

News June 13, 2024

ఉప్పల్: 22న ఫాస్ట్‌ బౌలర్ల కోసం టాలెంట్‌ హంట్‌

image

ఫాస్ట్‌ బౌలర్ల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ప్రత్యేకంగా టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవ్‌రాజ్‌ తెలిపారు. ఈ నెల 22న ఉప్పల్‌ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్‌ హంట్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లను హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News June 12, 2024

జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి సమావేశం

image

హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో వర్షాకాలం నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై చర్చించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

News June 12, 2024

Good News: HYDలో కొత్త‌రేషన్ కార్డులు!

image

హైదరాబాద్‌‌లో‌ని వలసదారులకు గుడ్‌న్యూస్. మైగ్రేషన్ రేషన్‌కార్డుల వడపోత ప్రక్రియ‌ మొదలైంది. 2014 తర్వాత కొత్తగా కార్డులు జారీ చేయకపోవడంతో‌ ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది.‌ 2020‌లో అప్లై చేసినా.. అర్హుల ఎంపిక పూర్తి కాలేదు. తాజాగా సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో అర్హుల ఎంపిక‌ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. SHARE IT

News June 12, 2024

హైదరాబాద్‌‌లో మ్యాన్‌హోళ్లను తెరిస్తే జైలుకే!

image

హైదరాబాద్‌లో ఇటీవల GHMC అధికారులు లోతైన మ్యాన్‌హోళ్లపై ఎరుపు రంగు పూశారు. భారీ వర్షం, వరదలు వచ్చినప్పుడు‌ మ్యాన్‌హోళ్లను తెరవద్దని హెచ్చరించారు. గతంలో‌ నాలాలో‌ పడి పలువురు‌ మృతి చెందారు. ఇటువంటి ప్రమాదాల నివారణ కోసం అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అక్రమంగా మ్యాన్‌హోల్స్‌ తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది. వరదల్లో వీటిని తెరవకండి. ఇతరులకు హాని కలిగించకండి. SHARE IT

News June 11, 2024

HYD: ఆ ప్రచారం నమ్మకండి: బల్మూరి వెంకట్

image

పదేళ్లు KCR గడీల పాలన సాగిందని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే గడీల పాలనకు స్వస్తి పలికామని MLC బల్మూరి వెంకట్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజా పాలన వచ్చిందన్నారు. పింక్ మీడియా అసత్యపు ప్రచారం చేస్తోందని, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నెలకు రూ.3 లక్షలు ఇస్తున్నారన్నారు. TSకు బదులు TGగా మార్చినందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయనేది అబద్ధమన్నారు.

News June 11, 2024

HYD: అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌లో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్

image

HYD నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీలో భాగంగా స్ట్రాటజిక్ కంటెంట్ కోఆర్డినేషన్ అసిస్టెంట్- కమ్యూనిటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కమ్యూనికేషన్స్, బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT

News June 11, 2024

HYD: సెక్రటేరియట్‌లో కొత్త రూల్స్ ఇవే..!

image

HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గేట్ నంబర్-4 నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోపలికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఇదే గేటు నుంచి లోపలికి రానున్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఇతర వీఐపీలకు సౌత్ ఈస్ట్ గేట్-2 ద్వారా ఎంట్రీ ఉండనుంది. ఇంకా మరమ్మతులు పూర్తి కాని వెస్ట్ గేట్-3 అలాగా ఉండనుండగా ఈస్ట్ గేట్-2ను మూసివేయనున్నారు.

News June 11, 2024

HYD: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మహమ్మద్ వసీం అనే వ్యక్తి 10 సంవత్సరాలుగా దుబాయ్‌లో ఉండి రాజాసింగ్‌కు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ అతడిని పట్టుకున్నట్లు చెప్పారు.

News June 11, 2024

HYD: శాశ్వత వీసీల నియామకం మరికొంత ఆలస్యం!

image

రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్‌ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్‌ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

News June 11, 2024

HYDలో ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష

image

HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్‌సైట్ చూడండి. SHARE IT