RangaReddy

News June 11, 2024

HYD: గృహజ్యోతి పథకం పునః ప్రారంభం..!

image

ఎన్నికల కోడ్ ముగియడంతో గృహజ్యోతి పథకం పునః ప్రారంభించామని అధికారులు తెలిపారు. RR, VKB పరిధిలో దీనిని ప్రారంభించగా 3.73 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఇక HYD, మేడ్చల్ పరిధిలో ఇప్పటికే కొనసాగుతోందన్నారు. అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారు.. చేసుకున్నా సాంకేతిక కారణాలతో సున్నా బిల్లులు రానివారు GHMC ప్రజాపాలన కేంద్రాల్లో అప్లై చేయాలని అధికారి ఆనంద్ తెలిపారు. SHARE IT

News June 11, 2024

HYD: పూల బొకేలు, శాలువాలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు పూల బొకేలు తీసుకురావద్దని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పూల బొకేలు, శాలువాలకు బదులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చేందుకు నోటు బుక్కులు, స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలు తెస్తే బాగుంటుందని కోరారు. కేంద్ర మంత్రి నిర్ణయంపై అందరూ భేష్ అంటున్నారు.

News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

News June 10, 2024

HYD: 19వ తేదీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

News June 10, 2024

HYD: నీట్ పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలి: R.కృష్ణయ్య

image

జూన్ 4న విడుదలైన నీట్ పరీక్ష 2024 ఫలితాలు, నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున, నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై CBIచే విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ R.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. విద్యానగర్ హిందీ మాహా విద్యాలయం నుంచి BC భవన్ వరకు విద్యార్థులతో ఆయన ర్యాలీ నిర్వహించారు.

News June 10, 2024

HYD: వేతనాల పెంపున‌కు కృషి చేస్తా: మంత్రి సీతక్క

image

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు, సవాళ్లు అనే అంశంపై ఈరోజు HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం వ్య‌వ‌సాయానికి అనుసంధానం, ప‌నిదినాల‌ను పెంచి కూలీలకు వేతనాలు పెంపున‌కు కృషి చేస్తామ‌న్నారు. ఉపాధి కూలీల‌కు మౌలిక స‌ధుపాయాలు క‌ల్పించేలా కృషి చేస్తామ‌న్నారు.

News June 10, 2024

HYD: మల్లారెడ్డి TDPలోకి వెళ్లడం లేదు: అనుచర వర్గం 

image

మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి TDPలోకి వెళ్తున్నారని, ఆయనకు TTDP అధ్యక్ష పదవి వస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఈరోజు మేడ్చల్‌లో మల్లారెడ్డి అనుచర వర్గం స్పందించింది. ఆ వార్త ఫేక్ అని, ప్రజలు నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. ఆయన TDPలో చేరేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని, BRSలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.   

News June 10, 2024

BREAKING: సికింద్రాబాద్ మహంకాళి బోనాల తేదీల ప్రకటన

image

తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తేదీలను దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, అర్చకులు సోమవారం వెల్లడించారు. జులై 7న ఘటోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జులై 21న బోనాలు.. 22న భవిష్యవాణి (రంగం) కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. SHARE IT

News June 10, 2024

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి హుండీ ఆదాయం లెక్కింపు

image

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, అధికారుల సమక్షంలో లెక్కింపు జరిగింది. 2 నెలల 15 రోజులకు గాను రూ.23,91,023 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపులో ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రామేశ్వర్, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

News June 10, 2024

HYD: నీట్ స్కామ్‌లో బీజేపీ నేతలు: చనగాని

image

నీట్-2024 పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. HYD గాంధీభవన్‌లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో దయాకర్ మాట్లాడారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ స్కామ్‌లో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.