India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) (అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ) తదితర కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు రెండు, మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 13వ తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 20వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దీంతో మారేడ్‌పల్లిలోని నివాసానికి శంకర్ యాదవ్ మృతదేహాహాన్ని తరలించారు.
వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల తర్వాత ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. నూతనంగా జిహెచ్ఎంసి ఇన్చార్జి కమిషనర్ అమ్రపాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.
గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషయం తెలిసిందే. బొంరాస్ పేట్ మండలంలానికి చెందిన సుమిత్రాబాయి(29) VKBDలో నిర్వహించిన పరీక్ష రాసి భర్తతో కలిసి ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో వర్షం పడుతుందని సుమిత్ర తన వద్ద ఉన్న గొడుగు తీసే ప్రయత్నంలో గట్టెపల్లి వద్ద కిందపడింది. దీంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
సైబర్ సెక్యూరిటీ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎథికల్ హ్యాకింగ్ తదితర కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడుతలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్.. సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణీ కర్యక్రమం నేటి నుంచి కొనసాగుతుందని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో యథావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దరఖాస్తు రూపంలో ప్రజలు తమ సమస్యలను అందించవచ్చునని తెలిపారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ద్వారా 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను విన్నవించవచ్చని సూచించారు.
పాముకాటుతో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. అల్లాకోట్‌కు చెందిన ఎడెల్లి రవి తన కుటుంబంతో నిద్రిస్తున్నారు. ఈక్రమంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూతురు పూజ(16) కుడికాలుకు పాము కాటేసింది. పూజను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పరిగిలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరిగిలో పల్లవి డిగ్రీ కళాశాల, కేటీఎస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 846 మంది అభ్యర్థులకు గానూ 651 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలు రాశారు. నిమిషం తేడా నిబంధన పెట్టడంతో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు తొమ్మిది గంటలలోపే చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.