RangaReddy

News March 16, 2025

HYD: అంతర్జాతీయ ప్రమాణాలతో బేగంపేట రైల్వే స్టేషన్

image

బేగంపేట రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. రూ.26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన మొదటి ఫేజ్ పనులు తుదిదశకు చేరుకోగా.. రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల కోసం ర్యాంపులు, లిస్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్, రైల్వే సమాచారాన్ని ప్రత్యక్షంగా చూసుకునేలా డిస్‌ప్లే తదితరాలు ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.

News March 16, 2025

HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

image

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

News March 15, 2025

రంగారెడ్డి: ఇంటర్ పరీక్షకు 759 మంది గైర్హాజరు

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 62,053 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 61,294 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 759 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

News March 15, 2025

HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

image

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

News March 15, 2025

UPDATE: మనవడి పుట్టినరోజున తాత సూసైడ్ 

image

మియాపూర్ PS పరిధిలో వ్యక్తి <<15762457>>ఆత్మహత్యకు<<>> పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేందర్ రావు దీప్తిశ్రీనగర్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం రాఘవేందర్ రావు మనవడు పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులు షాపింగ్‌కు వెళ్లగా అతను ఇంట్లోనే ఉన్నాడు. షాపింగ్ నుంచి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 15, 2025

శంషాబాద్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన RGIA పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. MBNRకు చెందిన బాలిక అదే ప్రాంతానికి చెందిన యువతితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వికారాబాద్‌కు చెందిన జోసఫ్ రాళ్లగూడలో నివాసముంటూ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

News March 15, 2025

HYD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

News March 15, 2025

HYD: హోలీ ఈవెంట్‌లో గొడవ.. యువకుడిపై కత్తిపోట్లు

image

పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బాధితుడి వివరాలిలా.. హొలీ ఈవెంట్‌లో ఉప్పు ఆదిత్య అనే యువకుడితో కొంతమందికి గొడవ జరిగింది. అనంతరం అతను బొడుప్పల్ వెళ్తూ నారపల్లి వద్ద ఆగాడు. బైక్‌పై వచ్చిన యువకులు కత్తితో దాడి చేశారు. అతణ్ని ఉప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News March 14, 2025

HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

image

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.

News March 14, 2025

బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

image

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.