RangaReddy

News June 7, 2024

యూరప్‌కు కమిషనర్.. ఆమ్రపాలికి GHMC బాధ్యతలు

image

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కమిషనర్ రోనాల్డ్ రాస్ 13 రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 23 వరకు ఆయన యూరప్‌‌లో పర్యటించనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అదనపు బాధ్యతలు HMDA(హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 13 రోజులు తాత్కాలికంగా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. SHARE IT

News June 7, 2024

HYD: నిమ్స్ ఆసుపత్రిలో మంత్రికి వైద్యపరీక్షలు

image

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ సాయి సతీశ్, జనరల్ మెడిసిన్ వైద్యుడు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలోని వైద్యబృందం సాధారణ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

News June 7, 2024

HYD: ‘దండం పెట్టి చెబుతున్నాం.. రోడ్లపై చెత్త వేయకండి’

image

గ్రేటర్ HYD ప్రజలకు శుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా పిలుపునిచ్చారు. HYD మాదాపూర్‌లోని గఫూర్‌నగర్‌లో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త (GVP పాయింట్)ను శుభ్రం చేసి, ముగ్గులు వేసి మాట్లాడారు. ‘ప్రజలందరికీ దండం పెట్టి చెబుతున్నాం.. ప్లీజ్ రోడ్లపై చెత్త వేయకండి.. ఇది మన హైదరాబాద్.. మనం అందరం శుభ్రంగా ఉంచుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు. కాగా దుర్వాసన వస్తున్నా వారు క్లీన్ చేశారు.

News June 7, 2024

HYD: అమలు కానున్న గృహ జ్యోతి పథకం! 

image

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో జూన్ నుంచి గృహజ్యోతి పథకాన్ని HYD, ఉమ్మడి RR జిల్లా పరిధిలోని వినియోగదారులకు వర్తింపజేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ, వికారాబాద్ సెక్షన్ల పరిధిలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు 11.50 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. SHARE IT

News June 7, 2024

రంగారెడ్డి: న్యాయ పరిపాలన శిక్షణకు దరఖాస్తులు

image

న్యాయ పరిపాలన శిక్షణ పొందేందుకు ఉమ్మడి RR (రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి) జిల్లాకు చెందిన ఎస్సీ అభ్యర్థుల నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు. బేసిక్ డిగ్రీ, లా డిగ్రీ పొంది జులై 1కల్లా 23 ఏళ్లు నిండిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. https://telanganaepass వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

News June 7, 2024

ఓయూలో సెల్ట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూలోని ఇంజినీరింగ్ కళాశాలలోని సెల్ట్ (సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్)లో నిర్వహించనున్న ‘ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఈనెల 11 వరకు స్వీకరిస్తున్నట్లు సెల్ట్ డైరెక్టర్ సవీన్ సౌడ తెలిపారు. 12 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సెల్ట్ కార్యాలయంలో పేరును నమోదు చేసుకోవాలన్నారు.

News June 7, 2024

HYDలో కొత్త రకం మోసం.. జర జాగ్రత్త!

image

కొందరు పబ్ ఓనర్లు, యువతులు కలిసి HYDలో కొత్త రకం మోసానికి తెర లేపారు. వ్యాపార వేత్తలు, శ్రీమంత యువకులను డేటింగ్ యాప్‌లలో పరిచయం చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా రితికా అనే యువతి తనకు పరిచయమై ఇలాగే మోసం చేసిందని ఓ బాధితుడు వాపోయాడు. హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ దగ్గర కలిసి పబ్‌కు వెళదామని ఫోన్ చేసి చెప్పిందన్నాడు. ఆమె ఏం తాగకపోయినా కాసేపటికి రూ.40,505 బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోయిందన్నాడు.

News June 7, 2024

HYD: కాంగ్రెస్‌లోకి 10 మంది BRS ఎమ్మెల్యేలు?

image

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో MLAల ఫిరాయింపుల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. BRS MLAలు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారని, ఇందులో HYD వారు ఉన్నారని సమాచారం. వచ్చే నాలుగున్నరేళ్లు సౌకర్యంగా ఉండడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కొందరు పార్టీ మారనున్నారనే చర్చ నడుస్తోంది. కాగా ఇటీవల 10మంది MLAలు కాంగ్రెస్‌లోకి వస్తారని మైనంపల్లి పేర్కొనగా ఆయన మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.

News June 7, 2024

HYD: ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

image

HYD నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా.నందమూరి తారక రామారావు కళామందిరంలో సంస్థ అధ్యక్షురాలు డా.దేవసేన నిర్వహణలో సాంస్కృతిక సంస్థ సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 42వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.  డా.దేవసేన 42 ఏళ్లుగా సాంస్కృతిక రంగానికి నిర్విరామ సేవలను చేస్తున్నారని కొనియాడారు. ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

News June 7, 2024

HYD: పోలీసులను చూసి పారిపోతూ వ్యక్తి మృతి

image

HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఆడుతున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసులను చూసిన వినయ్ అనే వ్యక్తి పారిపోతూ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి మృతిచెందాడు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొట్టడంతో తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకాడని ఆరోపిస్తూ అతడి స్నేహితులు ఆందోళనకు దిగారు.