India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెహికల్ ఓనర్‌తో పాటు తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల HYD శివారులోని శంకర్‌పల్లిలో బాలుడు (16) స్నేహితులతో కలిసి కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గుర్తు చేశారు. దీంతో కారు యజమాని, తండ్రిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. SHARE IT
HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్ బోనాలకు వచ్చే కేసీఆర్, టక్కర్‌బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.
అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్‌నగర్‌లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్‌బిహేవ్ చేశాడని విచక్షణ రహితంగా దాడి చేయడంతో చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.
ఔటర్ రింగురోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ గల మార్గంలో మొత్తం 18 అండర్పాస్ నిర్మించనున్నారు. ఈ హైవే విస్తరణలో భాగంగా చేవెళ్ల, మొయినాబాద్ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఈ 2 గ్రామాలు విస్తరించి ఉండడంతో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల పక్క నుంచి హైవే బైపాస్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి ఎక్కువగా భూసేకరణ చేయాల్సి వచ్చింది.
నిత్యం రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలతో నరకప్రాయంగా మారిన హైదరాబాద్- బీజాపూర్ హైవే విస్తరణ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గతంలోనే పూర్తయిది. ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.
ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శిఖర పూజతో లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రాజేందర్ యాదవ్, కమిటీ ప్రతినిధి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని HYD జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ NTR నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తోంది. పక్కా సమాచారంతో SOT ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు మరో మహిళ, శ్రీను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
Sorry, no posts matched your criteria.