RangaReddy

News June 6, 2024

జూపార్కు టిక్కెట్లను ఎక్కువ ధరకు విక్రయించటం లేదు: సునీల్ హీరామత్ 

image

జూపార్క్‌కు ప్రవేశ టిక్కెట్లను ఎక్కువ ధరకు విక్రయించటం లేదని నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ సునీల్ హీరామత్ తెలిపారు. జూపార్కు ప్రవేశ టిక్కెట్లు రూ.70కు బదులుగా రూ.100కు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం అవాస్తవమని ఆయన తెలియజేశారు. జూపార్కు ప్రవేశ టికెట్ పెద్దలకు రూ.70 , చిన్నారులకు రూ.45కు టికెట్లను అమ్ముతున్నామని క్యూరేటర్ చెప్పారు.

News June 6, 2024

HYD: ఇద్దరు యువకుల దారుణ హత్య

image

HYD శివారు కడ్తాల్‌ శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు యువకులను దారుణ హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందినవారిగా గుర్తించారు.

News June 6, 2024

HYD: భర్తను బెదిరించేందుకు ఆత్మహత్యాయత్నం

image

భర్తను బెదిరించేందుకు ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజేంద్రనగర్ PS పరిధి కిస్మత్పూర్‌లో సామెల్, గోవిందమ్మ నివాసం ఉంటున్నారు. సామెల్ మరో స్త్రీతో కనిపించినట్లు గోవిందమ్మతో ఓ మహిళ చెప్పింది. దీంతో గోవిందమ్మ ఆత్మహత్యాయత్నం చేయగా సామెల్ ఆసుపత్రికి తరలించాడు. కాగా సామెల్‌ గోవిందమ్మతో మాట్లాడిన మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News June 6, 2024

HYD: 8న చేప ప్రసాదం పంపిణీ

image

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈ నెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్‌ల కోసం బారికేడ్‌లు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను చేపట్టారు.

News June 6, 2024

HYD: జానీ మాస్టర్‌పై ఫిర్యాదు

image

జానీ మాస్టర్‌పై రాయదుర్గం PSలో బుధవారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తనను తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ వేధిస్తున్నారని, షూటింగ్‌లకు పిలవడం లేదని సతీశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 4 నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షూటింగ్ చెప్పిన కో-ఆర్డినేటర్లను సైతం బెదిరిస్తూ, జరిమానాలు విధించేలా చేస్తున్నారని ఆరోపించారు.

News June 5, 2024

మల్కాజిగిరిలో BRSకు విచిత్ర పరిస్థితి..!

image

మల్కాజిగిరి MP స్థానంలో BRSకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6సీట్లు, 2023లో 7కు 7 BRS క్లీన్ స్వీప్ చేసినప్పటికీ MPఎన్నికల్లో మాత్రం ఒక్కసారీ గెలవలేదు. ఇక్కడి ప్రజలు అసెంబ్లీకి BRSవైపే ఉంటున్నా MPకి మాత్రం వేరే పార్టీ వైపు చూస్తున్నారు. 2014 MPఎన్నికల్లో BRSఅభ్యర్థి మైనంపల్లి, 2019లో మర్రి రాజశేఖర్ రెడ్డి సెకెండ్ ప్లేస్‌లో ఉండగా ఈసారి రాగిడి థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు.

News June 5, 2024

HYD: అందెశ్రీని సన్మానించిన సీఎస్ శాంతికుమారి

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత డా.అందెశ్రీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYDలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా.అందెశ్రీని శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సీఎస్ సత్కరించారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతి కుమారికి అందెశ్రీ అందజేశారు.

News June 5, 2024

BREAKING: HYD: యువతిని కత్తితో పొడిచిన యువకుడు

image

HYD దుండిగల్ PS పరిధిలోని గండిమైసమ్మ వద్ద ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ యువతి కడుపులో యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆమెపై కత్తితో దాడి చేయడమే కాకుండా అతడు ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో యువకుడిని స్థానిక అరుంధతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

HYD: కాంగ్రెస్‌లో చేరిన నేతలకు పరాజయం

image

TGలో INC అధికారంలోకి వచ్చిన తర్వాత BRSను వీడిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, పట్నం సునీత MP ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి 1,72,897 తేడాతో ఓడిపోయారు. మల్కాజిగిరి సిట్టింగ్‌ స్థానంలో INC గట్టి పోటీ ఇవ్వలేకపోయినా.. డిపాజిట్ దక్కించుకుంది. ఇక సికింద్రాబాద్‌ MP స్థానంలో దానం మెరుగైన ఓట్లనే రాబట్టి 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల ముందు INCలో చేరిన నేతలను రాజధాని ప్రజలు ఆదరించలేదు.

News June 5, 2024

సికింద్రాబాద్: ఆ పార్టీల కుట్రలు తిప్పికొట్టారు: కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ప్రజలు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పి కొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలుస్తానని అన్నారు. ఈ దఫా మహిళలతోపాటు యువ, దళిత పలు మోర్చాల కార్యకర్తలు విశేష కృషి చేశారన్నారు.