India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MIM కంచుకోట హైదరాబాద్ లోక్‌సభలో BJP ఘోర పరాజయం పాలైంది. కమలం పువ్వు గుర్తు మీద 3,23,894 (29.98%) ఓట్లు సాధించిన మాధవీ లత 2వ స్థానంలో నిలిచారు. 3,38,087 ఓట్ల భారీ మెజార్టీతో ఆమెపై అసదుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించారు. కనీసం MIMకు వచ్చిన మెజార్టీ ఓట్లను సైతం BJP ఢీ కొట్టలేకపోయింది. పతంగి గుర్తు మీద ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో 6,61,981(61.28) ఓట్లు పోలవడం విశేషం.
చేవెళ్లలో బీజేపీ తరఫున బరిలో దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ స్థానం నుంచి రెండో సారి విజయం లభించింది. 2014లో ఆయన BRS నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ పార్టీ నాయకత్వంతో పొసగక బయటకొచ్చిన ఆయన 2019లో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొండా బీజేపీలో చేరి 2024లో ఎన్నికల్లో విజయం సాధించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. BJP చేతిలో పరాజయాన్ని చవిచూడడానికి అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీకి కాంగ్రెస్ సీనియర్లు KLRతో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పార్టీ నాయకులు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలోని దాదాపు అన్ని సీట్లలో BRS గెలిచినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం BJP గెలిచింది. BRS పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, బలమైన క్యాడర్ ఉన్నా సరే ప్రజలు BJP వైపే మొగ్గు చూపారు. కాగా BRS నేతలు, శ్రేణులు కూడా BJPకి ఓటేశారని.. BRS, BJP ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోపాయికారి ఒప్పందంతో అసెంబ్లీలో BRS, లోక్‌సభ ఎన్నికల్లో BJPని గెలిపించుకున్నారని చెబుతున్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 18,880 బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇందులో 18,496 బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 10,330 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డికి 6,230 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 1,787 ఓట్లు వచ్చాయి. నోటాకు 160 ఓట్లు రాగా.. చెల్లని బ్యాలెట్ ఓట్లు 222 ఉన్నాయి.
ప్రజలు ఇచ్చిన అవకాశంతో అహంకారాన్ని నెత్తిన ఎక్కించుకునే నాయకులకు ఏపీ ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని HYD రాజేంద్రనగర్ MLA, BRS నేత ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు తిరుగులేని మెజారిటీతో విజయం అందించినా నియంతృత్వం, అహంకారం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఆయన పరిమితమయ్యారని మండిపడ్డారు.
మల్కాజిగిరి ప్రజలు విలక్షణ తీర్పుకు పెట్టింది పేరుగా మారారు. గెలిపించిన పార్టీని వరుసగా మళ్లీ గెలిపించకుండా ప్రతిసారీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించగా ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించారు. మళ్లీ 2019లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించగా ఈసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై మీ కామెంట్?
ఉమ్మడి RR జిల్లా రాజకీయాలను శాసించిన పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీలకు ఎంపీ ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించడం లేదు. తాజాగా పట్నం సునీతారెడ్డి ఓటమే ఇందుకు నిదర్శనం. HYD పార్లమెంట్ స్థానం నుంచి గతంలో TDP అభ్యర్థిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పోటీ చేసి ఓడారు. 2014లో కార్తీక్ రెడ్డి పోటీ చేసి కొండా చేతిలో ఓడారు. దీన్ని బట్టి పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేయడం కలిసిరాలేదని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో సత్తా చాటిన BRS..MP ఎన్నికల్లో మాత్రం మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి,చేవెళ్లలో BRSను గెలిపించేందుకు KTRను నమ్మి KCR బాధ్యతలు అప్పగించారు.అందుకు తగ్గట్లు KTRరోడ్ షోలు, సభలతో హోరెత్తించారు. అయినా ప్రజలు BRSకు నో చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ BRS థర్డ్ ప్లేస్‌లో ఉండడం గమనార్హం.
మల్కాజిగిరి ప్రజలు ఈటలకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించారు. కాగా దేశంలో అతిపెద్ద ఎంపీ స్థానమైన ఇక్కడ 2009లో గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా, 2014లో గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా, 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈటల కేంద్ర మంత్రి అవుతారా వేచి చూడాలి.
Sorry, no posts matched your criteria.