RangaReddy

News June 5, 2024

HYD: ఓట్ల లెక్కింపు ప్రశాంతం: కమిషనర్

image

హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన కార్వాన్, నాంపల్లి, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, పోలీస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News June 5, 2024

HYDలో ఒకే ఒక్కరు..!

image

HYDలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. రాష్ట్రంలోని రూరల్‌ ప్రాంతాల్లో గెలుపుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి గ్రేటర్‌లో గెలవలేదనే నిరాశ ఉండేది. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజధానిలో ఆయన గెలవడం క్యాడర్‌లో సంతోషం నింపింది. ఖైరతాబాద్ BRS MLA దానం చేరికతో కాంగ్రెస్ బలం 2కి చేరింది.

News June 5, 2024

HYD: ప్రజల తీర్పును శిరస్సు వంచి స్వాగతిస్తున్నా: నివేదిత

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి స్వాగతిస్తున్నా అని బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్న అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లప్పుడూ తానూ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

News June 5, 2024

HYD: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News June 4, 2024

HYD: మహిళ దారుణ హత్య.. కేసు నమోదు

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధి వినాయక హిల్స్‌లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ చేయడం గమనార్హం.

News June 4, 2024

చేవెళ్ల: పోస్టల్ బ్యాలెట్‌లో కొండాకు ఎన్ని ఓట్లు అంటే..!

image

చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన గెలుపులో ఉద్యోగులు సైతం కీలక పాత్ర పోషించారు. మొత్తం 19,397 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కి 1,428, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 11,365, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 6,124ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

HYD: డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, BRS

image

HYD ఎంపీ స్థానంలో కాంగ్రెస్, BRS డిపాజిట్లు కోల్పోయాయి.ఇక్కడ పోలైన మొత్తం ఓట్లలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 61.28% ఓట్లతో గెలుపొందారు. BJP అభ్యర్థి మాధవీలతకు 29.98% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్‌కు 5.83%, BRS అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు 1.73% ఓట్లు రాగా డిపాజిట్లు కోల్పోయారు. ఒవైసీకి 6,61,981, మాధవీలతకు 3,23,894, సమీర్‌కు 62,962, శ్రీనివాస్‌కు 18,641 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ

image

CM రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి MP స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై BJP అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని CM ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక CM సొంత జిల్లా వికారాబాద్‌లోనూ BJP చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొడంగల్‌లో BJP MBNR అభ్యర్థి DKఅరుణ సత్తా చాటి గెలుపొందారు.

News June 4, 2024

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS ఓటమి

image

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్‌ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్‌పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. కాంగ్రెస్‌కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్‌కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.

News June 4, 2024

సమస్యలు పరిష్కరిస్తా: ఈటల రాజేందర్

image

భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి హోలీ మేరీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.