India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఐదో రౌండ్ వివరాలు మహేశ్వరం: కాసాని జ్ఞానేశ్వర్‌కు 1723, విశ్వేశ్వర్ రెడ్డికి 6745, రంజిత్ రెడ్డికి 4091 ఓట్లు వచ్చాయి. రాజేంద్రనగర్: కాసాని జ్ఞానేశ్వర్‌కు 1361, విశ్వేశ్వర్ రెడ్డికి 10064, రంజిత్ రెడ్డికి 6556 ఓట్లు వచ్చాయి. శేరిలింగంపల్లి: కాసాని జ్ఞానేశ్వర్‌కు 1521, విశ్వేశ్వర్ రెడ్డికి 8145, రంజిత్ రెడ్డికి 4828 ఓట్లు వచ్చాయి.
ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో భాజపా భారీ విజయం సాధించబోతుందన్నారు. జూన్ రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.
HYD ఎర్రగడ్డ కార్పొరేటర్, MIM మహిళా నేత షాహిన్ బేగం ఈరోజు మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో ఎర్రగడ్డ నుంచి MIM పార్టీ తరఫున ఆమె గెలిచారు. ఆమె మృతికి పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.
బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ సహా పలు నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు, స్థానిక నేతలందరినీ ఆయన కలిశారు. కీసర ప్రాంతంలోనూ ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడిన ఈటల మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తామని నమ్మకం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, శశాంక, గౌతమ్ పేర్కొన్నారు. ఫలితాలు వేగంగా అందించేలా యంత్రాంగానికి శిక్షణ ఇచ్చామని, సాంకేతికతను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఓట్లు ప్రకటిస్తామని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఘట్టం నేటితో తుది దశకు చేరుకుంది. సరిగ్గా ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవనుంది. HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కలిపి మొత్తం 155 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మొదట సికింద్రాబాద్ రిజల్ట్ సా.4గంటలకల్లా రానుంది. సా.4.40కి మల్కాజిగిరి, సా.5కి చేవెళ్ల, సా.5.20కి HYD రిజల్ట్ రానుంది. ఇక కంటోన్మెంట్ ఫలితం మ.3కే తేలనుంది.
రాజధాని పరిధి 4 MP స్థానాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే RR జిల్లా కలెక్టర్ శశాంక, VKB కలెక్టర్ నారాయణరెడ్డి గొల్లపల్లిలోని కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. HYD జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు.
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ వేళ HYD, RR జిల్లాల పరిధి MP అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పలు సర్వేలు రాజధానిలోని 3 స్థానాలు BJPకి అనుకూలంగా ఇచ్చాయి. కాంగ్రెస్‌కూ అవకాశం ఉందని మరికొన్ని సర్వేలు చెప్పగా.. BRSకు ఆదరణ ఉందని ఒకటి, రెండు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, HYD పార్లమెంట్‌లో కీలక నేతలు పోటీలో ఉండడంతో నగరవాసుల్లోనూ ఈ ఎన్నికలు ఆసక్తిని పెంచాయి.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey తాజాగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో BJP, హైదరాబాద్‌లో MIM పార్టీ గెలవబోతున్నట్లు RTV Survey పేర్కొంది. రాజధానిలో BRS ఖాతా తెరవదని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో 1,23,397 ఓట్లు పోలయ్యాయి.
లాస్య నందిత(BRS)-59,057(WIN)
శ్రీ గణేశ్(BJP)-41,888
వెన్నెల(INC)-20,825 ఓట్లు పడ్డాయి.
లాస్య నందిత అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో BJP నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్ ప్రస్తుతం INC నుంచి పోటీ చేశారు. నివేదిత సాయన్న(BRS), వంశతిలక్(BJP) బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలో 1,30,929 మంది ఓటేశారు. మరి గెలుపెవరిది.. మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.