India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో 1,23,397 ఓట్లు పోలయ్యాయి.
లాస్య నందిత(BRS)-59,057(WIN)
శ్రీ గణేశ్(BJP)-41,888
వెన్నెల(INC)-20,825 ఓట్లు పడ్డాయి.
లాస్య నందిత అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో BJP నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్ ప్రస్తుతం INC నుంచి పోటీ చేశారు. నివేదిత సాయన్న(BRS), వంశతిలక్(BJP) బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలో 1,30,929 మంది ఓటేశారు. మరి గెలుపెవరిది.. మీ కామెంట్?
HYD మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ వ్యక్తి భారీ మోసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. భాషెట్టి నాగరాజ్ అనే వ్యక్తి అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.50 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి పరారయ్యాడు. రూ.10 వడ్డీ ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల పైన వసూలు చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
POLYCET-2024 ఫలితాల్లో RR జిల్లా నుంచి MPCలో కటకం లలిత్ మనోహర్-119 మార్కులతో రాష్ట్రంలోనే 2వ, HYD చెలిమిళ్ల రోహన్-118 మార్కులతో 10వ ర్యాంకు, మేడ్చల్ వనం అమూల్య-118 మార్కులతో 12వ ర్యాంకు సాధించారు. HYD నుంచి బైపీసీలో మూతోజు విష్ణువర్ధన్-117 మార్కులతో స్టేట్ 5వ ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించారు. స్టేట్ 15 ర్యాంకుల్లో రాజధాని విద్యార్థులు సత్తా చాటారు.
HYD మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్ పీఎస్ పరిధి బలరాంనగర్‌లో ఈరోజు <<13367811>>మాధవి(34) అనే మహిళ<<>> హత్యకు గురైన విషయం తెలిసిందే. పిల్లలతో కలిసి అద్దె గదిలో ఉంటున్న ఆమెను ఎవరు చంపి ఉంటారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా దోపిడీ దొంగలు ఎవరైనా ఇంట్లోకి చొరబడి ఆమెను చంపేశారా అనే కోణంలో క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
పాలిసెట్ ఫలితాల్లో రాజధాని విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. HYDలో 10,095 మంది పరీక్ష రాయగా..84.40% ఎంపీసీ, 80.73% బైపీసీ, RR జిల్లాలో మొత్తం 4,103 మంది పరీక్ష రాయగా.. 86.74% ఎంపీసీ, 83.55% బైపీసీ, మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,267 మంది పరీక్ష రాయగా.. 91.74% ఎంపీసీ, 84.09% బైపీసీ, VKB జిల్లాలో మొత్తం 1145 మంది పరీక్ష రాయగా..86.99% ఎంపీసీ, 85.59% బైపీసీలో ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు.
భాగ్యనగర్ శ్రీమహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ఈరోజు మాట్లాడారు. ఈ ఏడాది HYD గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జులై 7వ తేదీన ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక పాతబస్తీలోని లాల్‌దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జులై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. SHARE IT
HYDలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫిలింనగర్ PS పరిధిలో ఓ డ్రగ్స్ విక్రేతను అరెస్ట్ చేశామని, 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కొకైన్ అమ్ముతూ నైజీరియా దేశస్థుడు ఒకొరియో కాస్మోస్ అలియాస్ ఆండీ పట్టుబడ్డాడని తెలిపారు. అతడు నగరంలో పలువురు యువకులకు రెగ్యులర్‌గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేస్తారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HYD, ఉమ్మడి RRలో అర్హులైన విద్యుత్ వినియోగదారులకు ఈనెల 6 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వారికి ఈనెల 1 నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలుకాగా, పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.