RangaReddy

News April 3, 2024

HYD: రసూల్‌పురలో యువకుడి హత్య

image

HYD బేగంపేటలోని రసూల్‌పుర అంబేడ్కర్‌నగర్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

HYD: కోరిక తీర్చాలని బాబాయ్ వేధింపులు

image

HYDలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలని బాబాయ్‌ యువతిని వేధించాడు. బాధితురాలు తల్లికి చెప్పడంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి లైంగికంగా వేధించగా ఆమె షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు పంపారు. అంతేకాకుండా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 15 రోజుల్లోనే 96 మంది పోకిరీలపై చర్యలు తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

News April 3, 2024

HYD: లాలాగూడ‌ CI సస్పెన్షన్

image

పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్‌ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లాలాగూడ CI పద్మను సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందితే నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయట. విచారణ చేపట్టిన కమిషనర్ తప్పుడు కేసుగా గుర్తించి.. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 3, 2024

HYD: లగేజ్ పోగొట్టుకున్నారా..? చెక్ చేసుకోండి..!

image

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, మర్చిపోయిన వస్తువులను అధికారులు భద్రపరిచి, వాటి వివరాలను https://bit.ly/3k3sY1X ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ఏవైనా మర్చిపోయినట్లయితే.. 040-66606064 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ghiallost&found@gmrgroup.in మెయిల్ ద్వారా సైతం సందేహాలను తెలపవచ్చని పేర్కొన్నారు. SHARE IT

News April 3, 2024

HYDలో ఇద్దరు పోలీస్ అధికారుల సస్పెండ్

image

HYDలో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్, ఓ ఎస్సై సస్పెండ్‌కు గురయ్యారు. రోడ్డు ప్రమాదం కేసులో విచారణ సరిగ్గా చేయలేదని లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మను సీపీ సస్పెండ్ చేశారు. కేసు విచారణలో ఉన్నతాధికారులను కూడా ఇన్‌స్పెక్టర్ తప్పుదోవ పట్టించారన్నారు. అలాగే అంబర్‌పేట్ ఎస్సై అశోక్‌ను సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. చైన్ స్నాచింగ్ బాధితులను వేధించారని సీపీ తెలిపారు.

News April 2, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✓ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
✓ఏప్రిల్ 13న చేవెళ్లలో BRS బహిరంగ సభ
✓చర్లపల్లి జైలుకు కల్వకుంట్ల కన్నారావు
✓మేడ్చల్, సికింద్రాబాద్ గాంధీ మెట్రో వద్ద మృతదేహాల కలకలం
✓OU:డిగ్రీ కోర్స్ రివాల్యూయేషన్ ఫలితాలు
✓BRS వాళ్లం కసి మీద ఉన్నాం: మల్లారెడ్డి
✓HYD: రూ.151లకే.. రాములవారి తలంబ్రాలు..!
✓మియాపూర్: మెట్రో డిపోలో ఫైర్ యాక్సిడెంట్
✓VKB: ఎన్నికల అధికారులకు ట్రైనింగ్

News April 2, 2024

HYDలో ప్రైజ్ రివిజన్ సబ్ కమిటీ మీటింగ్..

image

HYD బాగ్‌లింగంపల్లిలోని బస్ భవన్‌లో ASRTU ఆధ్వర్యంలో ప్రైజ్ రివిజన్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపులకు సంబంధించిన ధరలను నిర్ధారించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

News April 2, 2024

HYD: భారీగా పట్టుబడ్డ FAKE కరెన్సీ నోట్లు..!

image

ఫేక్ రూ.500 కరెన్సీ నోట్లు పట్టుబడ్డ ఘటన HYD ఈస్ట్ జోన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొత్తం ఆరుగురు సభ్యుల గ్యాంగ్ కలిసి ఫేక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి, సర్కులేట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36.35 లక్షల విలువ చేసే ఫేక్ నోట్స్ సీజ్ చేశారు. రూ.28,000 నగదు, ప్రింటింగ్ మెటీరియల్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News April 2, 2024

HYD: రైతుల రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరం: KTR

image

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది KCR, మాయ మాటలు చెప్పి గెలిచింది రేవంత్ రెడ్డి అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. శామీర్‌పేట్‌లో MLA మల్లారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్.. ఎన్నికల్లో చెప్పారని ఏప్రిల్ వచ్చినా రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరమన్నారు. BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, సుదర్శన్ ఉన్నారు.

News April 2, 2024

HYD: ORRపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

HYD శివారు జిన్నారం మండలం కాజిపల్లి శివారులోని ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఐడీఐ బొల్లారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ వాసి ఏసీ గాడ్ షేక్ ఇసాక్(54) ఓఆర్ఆర్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ షిఫ్ట్ కార్ డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ వేగంగా అతడిని ఢీకొట్టడంతో షేక్ ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.