India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మీర్‌పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్‌పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

HCUలో ప్రభుత్వ దామనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.

కర్మన్‌ఘాట్‌లో దారుణఘటన వెలుగుచూసింది. జానకి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకటేశ్వర్లుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత 8 నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సదరు మహిళ కుమారుడు పవన్‌కు వెంకటేశ్వర్లు మధ్య గత రాత్రి గొడవ జరిగింది. కోపంతో కత్తితో పొడిచిన పవన్ పరారీ అయ్యాడు. బాధితుడిని ఉస్మానియాకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది సందర్భంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు స్వస్తి పలకాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించ వద్దని ‘మాచన’ స్మోకర్స్‌ను కోరారు. పొగాకు ధూమపానం అలవాట్లు జీవితానికి చేదు అనుభవం మిగిలిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 222 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 163 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 48 నాలుగు చక్రాల వాహనాలు, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎండ తీవ్రతతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మరికొందరు ఉగాదికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాలు బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

HYDలో బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడింది. బాలానగర్ PS పరిధిలో 2022లో పోక్సో కేసు నమోదైంది. కేసు పూర్తి వివరాలు.. ఫిరోజ్‌గూడకు చెందిన బర్కత్ అలీ(21) ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. తాజాగా కూకట్‌పల్లిలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ విక్రమ్‌తో కూడిన ధర్మాసనం దోషిగా తేల్చి, 20 సం.రాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.

మాంసం దుకాణాలపై ఉగాది పండుగ ప్రభావం చూపుతోంది. నగరశివారు మూడుచింతలపల్లిలో చికెన్, మటన్ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెల బోయాయి. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు చికెన్, మటన్ షాపుల వద్దకు బారులు తీరుతారు. కానీ, ఈ ఆదివారం తెలుగు నూతన సంవత్సరం కావడంతో ప్రజలందరూ ఆలయాల దర్శనాలు, పంచాంగ శ్రవణం చేస్తున్నారు. దీంతో నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. గిరాకీ లేదని మాంసం వ్యాపారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.