India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర పేరిట ప్రత్యేక రైలు జూన్ 22వ తేదీన అందుబాటులో ఉంటుందని IRCTC తెలిపింది. ఒక వ్యక్తికి రూ.14,250 ఛార్జి ఉంటుందని, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తంజావూరు లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని పేర్కొంది. ఆసక్తి ఉంటే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG25 లింక్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. SHARE IT
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఈరోజు పరిశీలించారు. 10వ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, MP అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.
HYDలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు.. నైజీరియా దేశానికి చెందిన కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి బిజినెస్ వీసాపై 2014లో భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న రాంసిని అరెస్టు చేసి 16 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
TG ఏర్పాటైన పదేళ్లలో ప్రపంచ నగరాలతో HYD పోటీ పడిందని చెప్పొచ్చు. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ (2022) గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. HYDలో జరిగిన కీలక ఘట్టాలు.. 1. మెట్రో ప్రారంభం, 2. SRDPతో 36 ఫ్లై ఓవర్లు, 3. ట్యాంక్‌బండ్, HMDA పార్కుల సుందరీకరణ, 5. కేబుల్ బ్రిడ్జి, 6. IT కారిడార్, 7. నూతన సెక్రటేరియట్, 8. అమరవీరుల స్తూపం, 9. అంబేడ్కర్ విగ్రహం, 10. SNDP పనులు. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.
లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో రాజధాని ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. హైదరాబాద్‌లో (MIM), సికింద్రాబాద్(BJP), మల్కాజిగిరి(INC), చేవెళ్ల(BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
రేపు HYD పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
HYDలో ACB మెరుపుదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 8 మందికి చెక్ పెట్టింది. లంచం తీసుకొంటున్న ఇరిగేషన్ శాఖ AE భన్సీలాల్, అసిస్టెంట్ ఇంజినీర్స్ కార్తీక్, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్ గణేశ్‌ను పట్టుకొంది. కుషాయిగూడ PSలో రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన CI వీరాస్వామి, SI షఫీ ఆట కట్టించింది. గొర్రెల పంపిణీ స్కాం విచారణలో భాగంగా మాజీ మంత్రి OSDతో పాటు మరో అధికారిని ACB అరెస్ట్ చేయడం విశేషం.
గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి వైపు వస్తోండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు నవీన్ రెడ్డి(22), హరీశ్ చౌదరి(22)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చేవెళ్లలో దారుణం చోటు చేసుకుంది. చేవెళ్లకు చెందిన పదోతరగతి విద్యార్థినిని ఓ వ్యక్తి గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించడంతో గాంధీలో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని కొట్టుమిట్టాడుతుంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా సుదర్శన్ అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సుదర్శన్‌కు వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.