India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ ప్లాస్టిక్ శస్త్రచికిత్స దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్, యూనిట్ చీఫ్ డాక్టర్.పలుకూరి లక్ష్మీ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు రూమ్ నం.202లో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వైద్య సేవలు సర్జరీలు ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు. అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేస్తామని పేర్కొన్నారు.
గ్రేటర్ HYD పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గతేడాది అధికార గణంకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 620 భవనాలు శిథిలంగా మారాయి. సికింద్రాబాద్లో అత్యధికంగా 155, ఎల్బీనగర్లో 119, చార్మినార్లో 89, ఖైరతాబాద్లో 109, శేరిలిం గంపల్లిలో 62, కూకట్‌పల్లిలో 92 శిథిల భవనాలు ఉన్నాయి. ఈ భవనాల స్థితిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.
HYD నుంచి యాదాద్రి సమీపంలోని స్వర్ణగిరి టెంపుల్‌కి రెండు ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్, నాన్ ఏసీ బస్సులను RTC నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు బస్ టైమింగ్స్ విడుదల చేశారు. సికింద్రాబాద్ JBS నుంచి ఉ.7, 8, మ.2.50, 3.50 గంటలకు బయలుదేరుతాయని, తిరిగి స్వర్ణగిరి నుంచి JBSకు మ.12.10, 1.10, రా.8, 9 గంటలకు బస్సులుంటాయన్నారు. JBS నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.80 టికెట్ ధరగా నిర్ణయించారు.
HYD నగరంలోని రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి పెరిగింది. నిత్యం ఓపీలు 600-700 నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 350-400 మందికి కీమోథెరపీ, 200-250 మందికి రేడియో థెరపీ చేస్తున్నట్లు వివరించారు. ఏటా రోగులు గణనీయంగా 20% పెరుగుతున్నారని పేర్కొన్నారు.
యువతీయువకులు డ్రగ్స్ తీసుకున్నా,వారి కోసం పబ్‌లు పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని HYD మాదాపూర్ DCP వినీత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్‌లలో తనిఖీలు చేసేటప్పుడు అక్కడికక్కడే యూరిన్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పాజిటివ్‌గా తేలితే సంబంధిత వ్యక్తులపై NDPSయాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా,వాడినా 8712671111 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
HYD గోల్కొండ జాతరను వీక్షించేందుకు ఈరోజు ఉదయం నుంచే సికింద్రాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మియాపూర్, జవహర్‌నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సహా సెట్ విన్ బస్సుల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. లక్షల మంది రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్‌లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నేడు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఉప్పల్ సర్కిల్-2, హబ్సిగూడ సర్కిల్- 8, రామంతాపూర్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3రోజులపాటు పార్కింగ్ చేయాల్సిన ప్రాంతాలను అధికారులు తెలిపారు. SRనగర్ టీ జంక్షన్ సమీపంలోని R&B కార్యాలయంలో, ఫుడ్ వరల్డ్ ఎక్స్‌రోడ్ సమీపంలోని GHMC గ్రౌండ్‌లో, రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్ క్యూర్ హాస్పిటల్ పార్కింగ్ యార్డ్‌లో, ఫతేనగర్ రైల్వే వంతెన కింద మాత్రమే వాహనాల పార్కింగ్‌కు అనుమతించారు.
T.I.M.S నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని వారు వాపోతున్నారు. తాము జీతాలు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.