India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 3రోజులపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ-జంక్షన్ నుంచి అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్డు, సనత్ నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు డైవర్ట్ చేస్తారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.
✓దద్దరిల్లిన గోల్కొండ.. తొలి బోనం సమర్పణ పూర్తి
✓ఉప్పల్: శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్యాలు
✓కీసర: బాలికపై అత్యాచారం కేసులో మహేశ్ అరెస్ట్
✓KPHB: మహిళపై అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్
✓సికింద్రాబాద్: ఉజ్జయిని అమ్మవారి వద్దకు వెళ్లిన మంత్రులు
✓సికింద్రాబాద్: ప్రారంభమైన ఇస్కాన్ టెంపుల్ జగన్నాథ యాత్ర
✓దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి
విహార యాత్రలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అంబర్‌పేట్‌కు చెందిన ఐదుగురు యువకులు కలిసి ఈరోజు భద్రాచలానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన సమయంలో హరీశ్ (28) అనే యువకుడు గల్లంతై చనిపోయాడు. నీళ్ల లోతును అంచనా వేయలేక హరీశ్ కొట్టుకుపోయాడని అక్కడి పోలీసులు తెలిపారు. విషయం తెలిసి హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
HYDలోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన మాలతి & శ్రీనాథ్ నాగభైరవ కుమార్తె అరుషి నాగ భైరవ కూచిపూడి రంగ ప్రవేశ కార్యక్రమంలో నేడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత, గాయకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఉన్నారు.
తెలంగాణలో నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభ ఆధ్వర్యంలో జులై 15న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తున్నామని ఎంపీ R.కృష్ణయ్య, బీసీ జన సభ చీఫ్ రాజారాం యాదవ్, కొంపెల్లి రాజు తెలిపారు. ఈరోజు వాల్ పోస్టర్‌ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, అందరం కలిసి పోరాటం చేసి తమ సత్తా ఏంటో సీఎంకు చూపిస్తామన్నారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని అద్దెకు తీసుకున్న బైకులపై తిరిగి వస్తున్న ఇద్దరు HYD యాత్రికులపై కొండ చరియలు విరిగిపడడంతో చనిపోయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పద్మారావునగర్‌కు చెందిన సత్యనారాయణ(50), నిర్మల్ షాహి(36)తోపాటు మరో ఇద్దరు నార్త్ ఇండియా టూర్‌కి వెళ్లారు. ప్రమాదంలో వారి మృతదేహాలు బాగా డామేజ్ కావడం, ఓ వ్యక్తి తల కూడా దొరకకపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేశారని తెలిసింది.
HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్మల నృత్యనికేతన్ గురువు విజయలక్ష్మీ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక స్తోత్రం, అన్నమాచార్య కృతి, రామదాసు కృతి, సరస్వతి కీర్తన, తరంగం, పురందరదాసు కీర్తన, జయదేవ అష్టపది, పదం, మంగళ హారతి అంశాల్లో నృత్యం చేశారు. కార్యక్రమంలో హిమశ్రీ, కావ్య, రోషిత, తన్మయి, తన్విత, కీర్తియుక, శ్రీనిధి, సంజన ఉన్నారు.
HYD కీసరలో బాలిక(14)పై <<13578768>>బహదూర్‌పుర వాసి మహేశ్(25)<<>> అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాత్ రూమ్‌కు వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తండ్రి వెతికాడు. DCMలో అచేతన స్థితిలో ఉన్న కూతురిని చూసిన తండ్రి విలపిస్తూ వెళ్లి మహేశ్‌ను పట్టుకునేందుకు యత్నించగా అతడు వ్యాన్‌తో సహా పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
HYD గోల్కొండలో జగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేడు బోనాల నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు జాతర నేపథ్యంలో భక్తులు మరింత పోటెత్తుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈనెల 21, 22న సికింద్రాబాద్ మహంకాళి, 28, 29 తేదీల్లో పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ఈ మేరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
HYD గోల్కొండ కోట వద్ద గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో జులై 27వ తేదీన నిర్వహించనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 11వ కల్లు ఘట్టం సాక బోనం పండుగ పోస్టర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, భిక్షపతి గౌడ్, నరసింహ గౌడ్, మానస గౌడ్, మహేందర్ గౌడ్, బొమ్మెన రాజు గౌడ్, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.