RangaReddy

News July 7, 2024

HYD: దోస్తు మూడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు

image

దోస్తు మూడో విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లను మార్చుకుని మూడో విడతలో మరో కాలేజీలో సీట్లు పొందారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, కళాశాల విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 1,54,246 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు.

News July 7, 2024

HYD: జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం

image

HYD ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని, సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తామని,అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత అని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందన్నారు.

News July 7, 2024

HYD: గోల్కొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

image

భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ MLA దానం, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లంగర్ గౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు ప్రారంభించారు.

News July 7, 2024

HYD: కేసు ఉందని చెప్పి రూ.3 లక్షలు స్వాహా 

image

ఓ విశ్రాంత ఉద్యోగికి మీ పై కేసు ఉందని బెదిరించి సైబర్ కేటుగాళ్లు రూ.3 లక్షలు దోచేసిన ఘటన HYD పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. GMR ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న విశ్రాంత ODF ఉద్యోగి శ్రీనివాస్‌కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని చెప్పారు. సామాజిక వ్యతిరేక విషయాలను ప్రచారం చేసినందుకు మీపై చెంబూరు PSలో కేసు నమోదైందని బెదిరించి డబ్బు కొట్టేయగా అతడు PSను ఆశ్రయించాడు.

News July 7, 2024

BREAKING: HYDలో భారీగా బంగారం సీజ్

image

HYDలో భారీగా బంగారాన్ని DRI అధికారులు ఈరోజు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కోల్‌కత్తా నుంచి బస్సులో బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన DRI అధికారులు, నిందితులను విచారిస్తున్నారు.

News July 7, 2024

HYD: బాలికపై డీసీఎం డ్రైవర్ అత్యాచారం

image

బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలు.. HYD బహదూర్‌పుర వాసి మహేశ్(25) డీసీఎం డ్రైవర్. ఇతడు కీసర మండలం రాంపల్లిదాయరలోని ఓ పరిశ్రమ నుంచి పైపులు తీసుకెళ్లేందుకు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో సమీపంలో ఉండే బాలిక(14)పై అతడి కన్నుపడింది. రాత్రి వచ్చిన మహేశ్‌కు బాత్ రూమ్ వెళ్లిన బాలిక కనిపించగా తీసుకెళ్లి వ్యానులో అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News July 7, 2024

HYD: రూ.100 కోసం హత్య

image

వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.

News July 7, 2024

గోల్కొండ కోటకు 75 ప్రత్యేక బస్సులు

image

నేటి నుంచి చారిత్రక గోల్కొండ జగదాంబిక బోనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 75 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్‌లోని 24 ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు తిప్పనుంది. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్‌, పటాన్‌ చెరు, ఈసీఐఎల్‌, మెహిదీపట్నం, దిల్‌‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి గోల్కొండ కోట వరకు నడుస్తాయి.

News July 7, 2024

HYD: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రత్యేక బస్సులు

image

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ RTC శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న 18 డిపోల నుంచి 80 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, JBS, MGBS, CBS, ECIL క్రాస్ రోడ్స్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయన్నారు.

News July 7, 2024

HYD: పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా GHMC

image

గ్రేటర్ HYD నగరంలో వివిధ పన్నులకు సంబంధించి పూర్తి డిజిటలైజేషన్ దిశగా GHMC అడుగులు వేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపునకు నగదును స్వీకరించమని గతంలోనే కమిషనర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ నిబంధన అమల్లోకి వచ్చాయి. యూపీఐ, క్యూఆర్ కోడ్, క్రెడిట్ ఇతర మార్గాల్లో డిజిటల్ చెల్లింపులు చేయాల్సి ఉంది. దీని ద్వారా అక్రమ వసూళ్లకు తెరపడనుంది.