RangaReddy

News March 30, 2024

HYD: విద్యుత్ వినియోగం‌లో రికార్డ్ బ్రేక్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ‌ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే‌ ఆ రికార్డు‌ బ్రేక్‌ అవ్వడం గమనార్హం.

News March 30, 2024

HYD: OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

image

HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHB‌లోని ఓ హాస్టల్‌లో ఉండే యువతి(22)కి‌ 8 నెలల క్రితం డెలివరీ బాయ్‌‌ ఒబెదుల్లాఖాన్(23)తో‌ స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్‌లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్‌లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News March 30, 2024

HYD: లంచం తీసుకుంటూ దొరికిన SI

image

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ACB అధికారులు సోదాలు జరిపారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా SI సైదులుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ స్థలం విషయంలో సుభాశ్ అనే వ్యక్తిని ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం ACB రైడ్స్ చేసింది. ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News March 30, 2024

HYD: సీఎంని కలిసిన నందమూరి సుహాసిని

image

HYD నగరంలో తెలంగాణ టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. సుహాసినిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  మంత్రి సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2024

హైదరాబాద్: నేడు, రేపు LIC ఆఫీసులు పని చేస్తాయి

image

2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం శని, ఆదివారాలు (ఈనెల 30, 31 తేదీల్లో) తమ కార్యాలయాలు పని చేస్తాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వెల్లడించింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.

News March 30, 2024

హైదరాబాద్: కాచిన నూనెలతో మెదడుకు ముప్పు!

image

కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే
మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్తోపాటు ఇతర వ్యాధులకు దారితీసే అవకాశముందని స్పష్టం చేశారు. అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యాయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో నూనెకు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెల్లడైంది.

News March 30, 2024

HYD: 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాం!

image

GHMC పరిధిలోని 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, MLAల బలం అవసరమని భావిస్తోంది. ఇప్పటికే చేరికలు ప్రారంభం కాగా.. ఈ నియోజకవర్గాల పరిధిలో మరికొంతమంది MLAలను పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఐదుగురు MLAలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు మరికొందరు చేరే అవకాశం ఉందని సమాచారం.

News March 30, 2024

HYD: వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసుల దాడి

image

వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ అనే ఆర్గనైజర్ విజయపురి కాలనీలో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఓ మహిళ(30)తో వ్యభిచారం నడిపిస్తున్నాడు. కస్టమర్ వ్యభిచార గృహంలో ఉండగా.. మల్కాజిగిరి SOT పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆర్గనైజర్ సురేశ్ పరారీలో ఉన్నాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2024

HYD: నకిలీ ఆర్ఎంపీ వైద్యుడి అరెస్ట్

image

తాండూరులో నకిలీ RMP డాక్టర్‌గా చెలామణి అవుతూ, ఓ మహిళను నగ్నంగా వీడియోలు తీసిన కేసులో నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అహ్మద్‌ను తన క్లినిక్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఈ క్రమంలో ఓ మహిళతోనూ అసభ్యంగా వ్యవహరించి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మద్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

News March 30, 2024

HYD నగరంలో హీటెక్కిస్తున్న సూరీడు!

image

గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.