India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD పరిధిలో పాడైపోయిన లైట్లకు మరమ్మతులు జరగట్లేదు. కొత్త ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే చీకటి ప్రాంతాల్లో కొత్త వీధిలైట్ల ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. దీని వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు. పాదచారులు రహదారులపై నడవలేకపోతున్నారు. ముందు నడుస్తూ వెళ్లే వారిని వాహనదారులు గమనించలేకపోతున్నారు. దుర్భర పరిస్థితులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
HYDలో పిల్లలను ఎత్తుకెళుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు కాపాడారు. ఇందులో HYDతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు సైతం ఉన్నట్లు వారు గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఒంటరిగా బయటకు పంపించొద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు తెలియజేయాలన్నారు. SHARE IT
HYD శివారు మేడ్చల్ జిల్లా హకీంపేట్ వద్ద ఉన్న TGSRTC ITI కాలేజీలో మోటార్ మెకానికల్ వెహికల్, డీజిల్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ చేయడానికి గోల్డెన్ ఛాన్స్ ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 8, పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు HYD ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లను 9100664452, 040-23450033 సంప్రదించాలని సూచించారు. SHARE IT
ఉస్మానియా ఆసుపత్రి సీటీ తొరాసిక్ సర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు డీఎంఈకి పీజీ వైద్యురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకురాలు వాణి ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ విచారణ చేపట్టి పీజీ వైద్యురాలిని వేధించిన ఘటనలో సంబంధిత విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డిని వనపర్తి మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వేసవి సెలవులు అనంతరం JNTU ఇంజినీరింగ్ కళాశాల తెరుచుకుంది. మూడో ఏడాది వారికి ఇంటర్న్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా, ఇటీవల నాలుగో ఏడాది విద్యార్థులు పరీక్షలు ముగించుకున్నారు. దీంతో కళాశాల మొదటి రోజు 1, 2వ ఏడాది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కళాశాలలో మళ్లీ విద్యార్థుల కోలాహలం మొదలైంది. కాగా నాలుగో ఏడాది ఐడీపీ విద్యార్థులకు ప్రాజెక్ట్ వైవా కొనసాగుతుంది.
ఏఐఎంఐఎం మాలేగావ్ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ పై కాల్పులు జరిపిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పథకం ప్రకారం తమ పార్టీ మాలేగావ్ అధ్యక్షుడిపై దుండగులు ఆదివారం రాత్రి మూడుసార్లు కాల్పులు జరిపి పారిపోయారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడ్డ అబ్దుల్‌ను ప్రైవేటు చేర్పించి చికిత్స జరిపిస్తున్నామని.. కాల్పుల ఘటనపై విచారణ జరపాలని కోరారు.
నగరంలో కొన్ని రోజులుగా గాలిదుమారం రేగుతోంది. ఆదివారం పలు ప్రాంతాల్లో విపరీతమైన వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాల్లో హోర్డింగులపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ బోర్డులు చెల్లాచెదురయ్యాయి. ఒకవేళ అవి వాహనాలపై పడితే. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో GHMC ప్రకటనల విభాగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీ బోర్డులను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించింది.
HYDలో విషాద ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపిన వివరాలు.. గుంటూరు వాసులు యజ్ఞ నారాయణ(25), సత్యనారాయణ (30), సాయిపవన్(32) సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్‌పై బిర్యానీ తినేందుకు బయటకు వెళ్లగా కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద ఓ మినీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో యజ్ఞ నారాయణ, సాయిపవన్ మృతిచెందగా సత్యనారాయణకు గాయాలయ్యాయి. కేసు నమోదైంది.
హఫీజ్‌పేట్-సనత్‌నగర్ మధ్య పాదచారుల వంతెన మరమ్మతుల కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లను కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. నేడు (మంగళవారం) 7 ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను పూర్తిగా.. 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే 6 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సులు పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్‌టైం ఛాన్స్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫీజును వచ్చే నెల 20వ తేదీలోగా, రూ.500 అపరాధ రుసుముతో 25వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అందరూ ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.