RangaReddy

News March 29, 2024

HYD: స్వచ్ఛ ఆటోలకు చెత్త వేసేది కొంచమే..!

image

గ్రేటర్ HYDలో మెజార్టీ బస్తీ, మురికివాడల్లో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడంలేదని GHMC గుర్తించింది. ఇప్పటి వరకు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1.62 లక్షల ఇళ్లకు గాను 1.2 లక్షల ఇళ్లలో చెత్త సేకరణ చేయటం లేదని తేలిపోయింది. అంటే దాదాపు 76% ఇళ్ల నుంచి స్వచ్ఛ ట్రాలీ కార్మికులు చెత్త సేకరించడం లేదు. అధిక రుసుము, వాహనాలు పలు ప్రాంతాలకు వెళ్లకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు.

News March 29, 2024

HYD: GV పాయింట్లు అంటే ఏంటో తెలుసా..?

image

గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ప్రజలకు వందలసార్లు అవగాహన కల్పించినప్పటికీ రోడ్ల పక్కన ఇప్పటికీ చెత్త వేస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ చెత్త చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అలాంటి ప్రాంతాలను గుర్తించిన GHMC అధికారులు, వీటికి గార్బేజ్ వల్నరబుల్ (GV) పాయింట్లుగా పేరు పెట్టారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వీటిని తొలగించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నారు.

News March 29, 2024

HYD: కిడ్నీలపై ఓ కన్నేసి ఉంచండి: డా.శ్రీ భూషణ్

image

కిడ్నీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచాలని HYD నిమ్స్ డా.శ్రీ భూషణ్ రాజు తెలిపారు. కిడ్నీల్లోని నెఫ్రాన్లు రక్తం వడపోయడంలో కీలకపాత్ర వహిస్తాయని, చిత్రం ఏంటంటే ఇవి దెబ్బతింటున్న తొలిదశలో పైకి కనిపించదన్నారు. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయని, కిడ్నీల సామర్థ్యం తగ్గి, తర్వాతి దశలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందన్నారు. తొలిదశలో గుర్తిస్తే, త్వరగా దెబ్బ తినకుండా వ్యాధి ముదరకుండా చూసుకోవచ్చన్నారు.

News March 29, 2024

HYD: ‘ఆ ఒక్క సెకండ్.. ప్రాణాన్ని కాపాడుతుంది’

image

HYD వాహనదారులకు ఎల్లప్పుడూ రాచకొండ పోలీసులు డ్రైవింగ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో సూచన చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కేవలం ఒక్క సెకండ్ పడుతుంది. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోరో..! ప్రమాదం జరిగినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఆ క్షణంలో సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని, వాహనంలో వెళ్లే అందరూ ధరించాలని సూచించారు.

News March 29, 2024

HYD: గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు

image

HYD తార్నాకలోని IICT గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు చేస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగం నియంత్రించడంపై దృష్టి సారించింది. క్లీన్ ఎనర్జీగా హైడ్రోజన్‌కు పేరున్న నేపథ్యంలో కోబాల్ట్ టెర్పరిడిన్ రసాయన మూలకాన్ని ఉపయోగించి వాణిజ్యపరంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.

News March 29, 2024

HYD: దానం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

BJPతో కలిసి BRS పనిచేయనుందని స్వయంగా KTR చెప్పడంతోనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో చేరానని ఖైరతాబాద్ MLA, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ.. BJPతో కలిస్తే BRS సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించానన్నారు. గతంలో KCR అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టమని కానీ ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మీ కామెంట్?

News March 29, 2024

HYD: డబ్బుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి..!: కొండా

image

డబ్బుల కోసమే ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఈసారి 3 లక్షల మెజార్టీతో తానే గెలుస్తానని, హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిని సైతం మంజూరు చేయించినట్లుగా తెలిపారు. 100 రోజుల్లో కేవలం 50 రోజులు మాత్రమే రేవంత్ రెడ్డి పాలన బాగుందన్నారు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు.   

News March 29, 2024

HYD: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌

image

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు షెడ్యూల్‌ వచ్చేసిందని HYDలోని అధికారులు తెలిపారు. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుందన్నారు. ఏప్రిల్‌ 15 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ కోసం తమ వెబ్‌సైట్‌ https://kvsangathan. nic. in/ను సందర్శించాలని వారు కోరారు.

News March 29, 2024

HYD: త్వరలో 24 గంటలు వాటర్ ట్యాంకర్ నీటి సరఫరా

image

వచ్చే నెల మొదటి వారం నుంచి 24 గంటల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిశోర్ తెలిపారు. HYD ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే, ఈ సారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు.

News March 29, 2024

HYD: KTRపై కేసు నమోదు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కేసు నమోదైంది. CM రేవంత్ రెడ్డిపై KTR అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని TPCC సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను KTR తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై IPC సెక్షన్లు 504, 505 కింద జీరో FIR నమోదు చేసి కేసును HYD బంజారాహిల్స్ PSకు బదిలీ చేశామని అక్కడి ఇన్‌స్పెక్టర్ సతీశ్ తెలిపారు.