India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓయూ కేటగిరి-2 పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈనెల 11తో గడువు ముగియగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీని రూ.2,000 లేట్ ఫీజుతో ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు.
హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్‌లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.
OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.
బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణాను అరికట్టి బాధితులను ప్రజ్వల షెల్టర్ హోమ్‌కు తరలించిన ఘటనలో ప్రతిభ కనబరిచిన ఫిలింనగర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పంజాగుట్ట కానిస్టేబుల్ లావణ్యకు HYD సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో వీరు చూపిన శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.
HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నకిలీ పాస్‌పోర్ట్‌తో వచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. గల్ఫ్ నుంచి నకిలీ పాస్‌పోర్టుతో స్వదేశానికి చేరుకున్న ఓ వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లాకు చెందిన శంకర్ 6 ఏళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. తిరిగి స్వదేశానికి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో వస్తున్న క్రమంలో భద్రతా అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు.
హైడ్రా సోమవారం ప్రజావాణిని నిర్వహించింది. ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత లేఔట్లు, రహదారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాలని పలువురు వినతులు అందజేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేస్తున్నారని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పందన లేదని పలువురు వాపోయారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వెన్నెలగడ్డలో విషాదం జరిగింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. MBA చదువుతున్న ప్రియాంక (26) రవికుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. తను వేరే పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,726 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,271 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,455 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.