India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD బాచుపల్లిలో భార్యను భర్త పాశవికంగా<<13309581>> హత్య చేసిన విషయం<<>> తెలిసిందే. అయితే భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్‌లోని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తి తోనే పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స చేయించి రిమాండ్‌కు తరలించారు.
బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.
బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.
ఓ యువకుడు అమ్మాయి పేరిట డబ్బులు కాజేశాడు. సైబర్ క్రైం ACP బి.రవీందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మారం అశోక్‌రెడ్డి(23) స్నాప్ చాట్‌లో ప్రణీతరెడ్డి పేరిట నకిలీ ID సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్ ఫొటో పెట్టి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. అలా రూ.14 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
జూన్ 3వ తేదీ నుంచి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారిణి కె.రోహిణి పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 35 కేంద్రాల్లో 12,186 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఆయా సెంటర్‌లకు సకాలంలో చేరుకోవాలని ఆమె సూచించారు. SHARE IT
నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్- సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్- మేడ్చల్ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు.
SHARE IT
చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు సందర్శించారు. మోహన్ యాదవ్, ఆయన సతీమణి సీమా యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా దంపతులకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శశికళ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సాయి అనురాగ్ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.
తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.
త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.