India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ పరిశీలించారు.
HYD నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్‌లకు అటాచ్ చేస్తూ ఆదేశించారు.
HYD శివారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. పది రోజుల క్రితం షాబాద్ మండలం కేసారం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న దళిత విద్యార్థి బేగరి యాదగిరిపై అదే గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి దాడి చేశాడు. బహిరంగంగా తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఈఘటనలో బుధవారం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కాంతారెడ్డి తెలిపారు.
వర్షాకాలంలో ఈవీడీఎం విభాగం, పోలీసులు సమన్వయంతో పనిచేసి నగరంలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుందామని ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్‌తో పాటు ట్రై కమిషనరేట్ల (HYD, సైబరాబాద్, రాచకొండ) పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి RR జిల్లాలోని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. కాగా ఇప్పటికే తమ నేత మంత్రి అవనున్నారని, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో ఎవరు మంత్రి అవతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలోని ఐదు గురుకుల విద్యా సంస్థల్లో కామన్ టైమ్ టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా బోధన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలో అయితే డేస్కాలర్ స్కూల్ తరహాలో టైమ్ టేబుల్ అమలు చేస్తున్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే విధానం అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి బుధవారం HYDలో ఉత్తర్వులు జారీ చేశారు.
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన నేడు స్థాయీ సంఘం సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 11 అంశాలకు సంబంధించి.. అన్ని పార్టీల సభ్యులు చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపనున్నారు. GHMCలోని వివిధ శాఖల అధికారులు, సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు.
వర్షాల నేపథ్యంలో రోడ్లపై భారీగా నిలిచే నీళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా జలమండలి డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 238 స్టాటిక్, 154 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వర్షపు నీటి తొలగింపులో నిమగ్నమయ్యాయి. రాత్రి నగరంలో పలుచోట్ల కురిసిన వర్షానికి నీరు నిలిచిన ప్రాంతాల్లో ఈ బృందాలు నీటిని తొలగించాయి.
HYD, ఉమ్మడి RRలో యువత ఆసక్తిని కొన్ని జిమ్ సెంటర్లు ఆసరాగా చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరగా సిక్స్ ప్యాక్స్ రావాలన్నా, లావు తగ్గాలన్నా, ఎక్కువ సేపు జిమ్ చేయాలన్నా నిషేధిత స్టెరాయిడ్స్ వాడాలని కొందరు కోచ్‌లు చెప్పడం గమనార్హం. ఇటీవల మెహదీపట్నంలో ఓ యువకుడు నిషేధిత ఇంజక్షన్ తీసుకుని కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు.పాతబస్తీలో ఈ ఇంజక్షన్లు, మాత్రలు అమ్మే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
BRS రాష్ట్ర నేత RS ప్రవీణ్ కుమార్‌పై MLC, NSUI స్టేట్ చీఫ్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. BRSఅధికారంలో ఉన్నప్పుడు వేకెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా RS ప్రవీణ్ కుమార్ GO నంబర్ 81లో మార్పులు ఎందుకు చేయలేదని బల్మూరి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. 2018లోనే GOలో మార్పులు చేసి ఉంటే సమస్య ఉండేది కాదని, అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వేకెన్సీ నిబంధనలనే తమ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.
Sorry, no posts matched your criteria.