India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఖైరతాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద కల్కి 2898 AD సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో భాగంగా మూవీలో ఉపయోగించిన భారీ ట్రక్‌ను ప్రదర్శించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసేందుకు వేలాదిగా ప్రభాస్ ఫ్యాన్స్ తరలివచ్చారు. జపాన్ నుంచి కొందరు ఫ్యాన్స్ వచ్చి ట్రక్కు ముందు నిలబడి ఫొటోలు దిగారు. రెబల్ స్టార్ ర్యాంపో అంటూ కేకలు వేశారు. జపాన్ నుంచి HYD వచ్చి సినిమా చూడడం సంతోషంగా ఉందన్నారు.
HYD నగరాన్ని ప్రపంచంలోనే దీటైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓవైపు RRR(రీజినల్ రింగ్ రోడ్), మరోవైపు మూసి రివర్ డెవలప్‌మెంట్, ఇంకోవైపు శంషాబాద్ పరిసరాల్లో 1000 ఎకరాల్లో ఫార్మసిటీ హబ్, వీటన్నింటికి తోడు HYD ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా మార్చే ప్రాజెక్టులతో HYD నగర రూపురేఖలే మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని డాక్టర్లు తెలియజేశారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 9392249569కు కాల్ చేయాలని అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో అన్ని విధాల వైద్య సేవలు గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
SHARE IT
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓలా, ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే వారికి అధికారులు శుభవార్త చెప్పారు. ఇక నుంచి క్యాబ్ క్యాన్సిలేషన్ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం అని వెల్లడించారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. SHARE IT
✓బోయిన్‌పల్లి: బ్రీత్ అనలైజర్‌తో మందుబాబు పరారీ.. చివరికి అరెస్ట్
✓GHMC పరిధిలో కమిషనర్ ఆమ్రపాలి తనిఖీలు
✓చేవెళ్ల: MLA యాదయ్య చేరికకు వ్యతిరేకంగా నినాదాలు
✓హబీబ్‌నగర్: నగరంలో తక్కువ ధరకే మాంసం అంటూ మోసం
✓జులై 8 నుంచి 10 వరకు బల్కంపేట బోనాలు
✓అన్ని జిల్లాల్లో బోనాల పండుగ చెక్కుల పంపిణీకి సిద్ధం
HYD అంబర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలిక (14)పై డేవిడ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. మరోసారి అత్యాచారం చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రేప్, పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పంజాగుట్ట NIMS ఆసుపత్రి పరిసరాలలో పారిశుద్ధ్యం లోపించింది. ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం వచ్చే ప్రజలు అనారోగ్యాల పాలయ్యేలా ఉంది. మిలీనియం బ్లాక్ వెనకాల డ్రైనేజీ, గార్బేజి కంపు కొడుతుంది. దోమల బెడద సైతం అధికంగా ఉంటుందని రోగులు వాపోతున్నారు. మరోవైపు ఆసుపత్రి లైబ్రరీ మొత్తం ఇనుప సామగ్రితో నిండిపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని పేషెంట్లు, సహాయకులు కోరుతున్నారు.
డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో సహకరించకుండా బ్రీత్ అనలైజర్ లాక్కొని పరారీ అయిన వాహనదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లిలో జూన్ 27న తనిఖీలు నిర్వహించారు. కారులో వస్తున్న శ్రవణ్ కుమార్‌ను ఆపి టెస్ట్ చేయబోయారు. ఒక్కసారిగా బ్రీత్ అనలైజర్‌ను లాక్కున్న అతడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు.
GHMC కమిషనర్ ఆమ్రపాలి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణగూడలో శానిటేషన్ పనులపై ఆరా తీశారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ZCని ఆదేశించారు. శంకర్‌మఠ్ వద్ద రాంకీ RFC వెహికిల్ డ్రైవర్‌తోనూ ఆమె మాట్లాడారు. చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో స్కూల్ విద్యార్థినికి పరిశుభ్రతపై కమిషనర్ అవగాహన కల్పించారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన HYD బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల జాతర తేదీలను నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 9వ తేదీన అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు రానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. SHARE IT
Sorry, no posts matched your criteria.