India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. టీఎస్ ఉమా మహేశ్వర్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏసీబీ కోర్టు విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ కొనసాగనుంది. మరికాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు.
నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోపై అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతిపాదిత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్, కూడలికి కుడి వైపు వస్తుందని, దీన్ని ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా స్కై వాక్‌లోనే సమతలంగా ఉండే వాకలేటర్ ( దీని పై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (ఈవినింగ్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే 6 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహిస్తామన్నారు.
గ్రేటర్ HYD నగరంలో మోడల్ కారిడార్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సౌకర్యవంతమైన రహదారులే లక్ష్యంగా GHMC ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఎల్బీనగర్, హబ్సిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా కాలిబాట, సైకిల్ ట్రాక్, వీధి వ్యాపారులకు స్థలం, సర్వీసు రోడ్డు, మూడు లైన్ల ప్రధాన రహదారి, పచ్చదనంతో కూడిన విభాగిని ఉండేలా రూ.56.82 కోట్లతో 29 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు జరగలేదు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో దంపతులపై చెట్టు కూలి వింజాపురం రవీందర్ మృతిచెందగా భార్య సరళాదేవి తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. కాగా ఆస్పత్రి నిర్వాహకులు, కంటోన్మెంట్ అధికార సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బంధుమిత్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు ఆందోళనకు దిగారు. గాంధీ ఆసుపత్రిలో మృతుడి ఇద్దరు కూతుళ్లు పడ్డ ఆవేదన వర్ణనాతీతం అని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ 25వ వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ పదవీ కాలం మే 21న ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వీడ్కోలు సమావేశం నిర్వహించి, ప్రొఫెసర్, డాక్టర్ రవీందర్ దంపతులను ఘనంగా సన్మానించిన యూనివర్సిటీ బృందం ఘన వీడ్కోలు పలికింది. కాగా నూతన వీసీగా దాన కిషోర్ IASని ప్రభుత్వం నియమించగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొద్దిరోజుల క్రితం మోస్తారు చిరుజల్లులు కురిశాయి. దీంతో దుక్కులు దున్నుతున్న రైతన్న వర్షాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో విత్తనాలకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొందరు నకిలీ విత్తనాలు తయారు చేసి, విక్రయించేందుకు తెరలేపుతున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే 8712662111కు కాల్ చేయాలన్నారు.
ఇటీవలే కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఇసుక కొట్టుకురావడంతో అవి కట్టగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి. అంతేకాకుండా దుమ్ము, ధూళితో అసౌకర్యంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ఒకానొక సందర్భంలో స్కిడ్ అయి పడిపోతున్నామని అంటున్నారు. ఇసుక మేటలను తొలగించాలని కోరుతున్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో 16.57 లక్షల మంది ఓటు వేసి 56.40 ఓటింగ్ శాతం నమోదు చేయటం పట్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ X వేదికగా ట్వీట్ చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో 3.58 లక్షల మంది అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.