RangaReddy

News May 22, 2024

FLASH: ఓయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్

image

HYD ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇన్ని రోజులు కొనసాగిన ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం దాన కిషోర్‌ను వీసీగా నియమించింది. ఈ మేరకు ఓయూ చేరుకున్న ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News May 22, 2024

HYD: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి: రాచకొండ సీపీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీపీ తరుణ్ జోషి సూచించారు. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 170 ట్యాబ్స్, 18 ల్యాప్ టాప్స్, 80 అధునాతన డిస్క్ టాప్‌లను స్టేషన్ హౌస్ అధికారులు, పెట్రోమొబైల్స్ సిబ్బందికి నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర సేవలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు.

News May 22, 2024

HYD: లాడ్జిలో బాలికపై యువకుడి అత్యాచారం

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ తుకారంగేట్ PS పరిధిలో ఉండే బాలిక(16) తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అదే సమయంలో బైక్ వస్తున్న సందీప్ రెడ్డి(28) ఆమెను ఆపాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కేసు నమోదైంది.

News May 22, 2024

HYD: ఆరు మార్గాల్లో నిర్మించనున్న మెట్రో రెండో దశ!

image

మెట్రో రెండో దశపై అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రారంభం కానుంది. HYDలోని 6 మార్గాల్లో నిర్మించనున్న మెట్రో రెండో దశపై సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. జూన్‌లోనే DPR సిద్ధం చేయనున్నట్లు HMRL అధికారులు తెలిపారు. రెండో దశ మెట్రో నిర్మాణంలో భాగంగా మొదట ఎయిర్‌పోర్ట్ కారిడార్‌ను చేపట్టనున్నారు.

News May 22, 2024

గ్రేటర్ HYD అమృత్ ప్రాజెక్టు కోసం 5 పార్కుల ఎంపిక

image

అమృత్ ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా గ్రేటర్ HYD నగరంలో చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 5 మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. HYD నగరంలోని ఖైరతాబాద్ జోన్‌లో కేఎల్ఎన్ యాదవ్ పార్కు, శేరిలింగంపల్లి జోన్లో టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్లో ఇందిరా పార్కు, ఎల్బీనగర్ జోన్లో హబ్సిగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్కు, సైనిక్‌పురిలోని ఈ-సెక్టార్ పార్కులు.. పైలెట్ ప్రాజెక్టులో ఉన్నాయి.

News May 22, 2024

గాంధీ హాస్పిటల్ డీప్ ఫేక్ వీడియో X నుంచి తొలగింపు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ గాంధీ హాస్పిటల్ పై Xలో పోస్ట్ చేసిన డీప్ ఫేక్ వీడియోను BRS USA ఎక్స్ ఖాతా నిర్వాహకుడు హరీశ్ రెడ్డి తొలగించారు. తనకు తెలియక పొరపాటున పాత వీడియోను పోస్ట్ చేశానని, అపాలజీ చెబుతూ.. మరో వీడియో పెట్టారు. గాంధీ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో హరీశ్ రెడ్డిపై చిలకలగూడ PSలో IT, IPC 505 క్లాజ్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు SHO అనుదీప్ తెలిపారు.

News May 22, 2024

HYD: సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ల గాలం.. జర జాగ్రత్త!

image

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా యూజర్లను టార్గెట్ చేశారని, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, X వంటి వాటిల్లో ఫేక్ ప్రకటనలు పెట్టి గాలం వేసి, మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాజాగా HYD నాంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన రీల్స్ ఆధారంగా ఒక యాప్‌లో విడతల వారీగా రూ.33.26 లక్షల పెట్టుబడి పెట్టి, మోసపోయి HYD CCS పోలీసులను ఆశ్రయించాడు.

News May 22, 2024

TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు మన HYDలో..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ఇంటర్మీడియట్ పూర్తై ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈమేరకు మన HYDలో TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నట్లు NIR వెల్లడించింది. దేశంలోనే IITH-18, IIIT HYD-55, HCU-71, JNTUH-83 ర్యాంకు సాధించాయి. టాప్ కాలేజీలలో అత్యుత్తమ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు NIRF పేర్కొంది.

News May 21, 2024

HYD: పోలీసులపై గొడ్డలితో దాడి.. ముగ్గురు అరెస్టు

image

మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో రెండు బైకులు ఢీకొనడంతో వాళ్ల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తుండగా ఆ వ్యక్తులు పోలీసులపై కత్తితో దాడి చేశారు.

News May 21, 2024

HYD: ఫెయిల్ అయిన వారికి పాఠాలు చెప్పరా?

image

HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మొత్తంగా పదవ తరగతిలో 19,114 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇందులో దాదాపుగా 5,153 మంది ప్రభుత్వ విద్యార్థులు ఉండటం గమనార్హం. జూన్ 3 నుంచి 13 వరకు సప్లమెంటరీ పరీక్షలు జరగనుండగా ఇప్పటి వరకు సర్కారు బడుల్లో ఫెయిల్ అయిన వారి కోసం ప్రత్యేక తరగతులు ప్రారంభించలేదు. మరి ఫెయిల్ అయిన వారిని పట్టించుకోరా..? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు.