RangaReddy

News July 3, 2024

HYD: దానం నాగేందర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: రామచంద్రరావు

image

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కొరియర్, మెయిల్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తెలిపారు. తాము సమర్పించిన పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు.

News July 3, 2024

HYDలో డెంగ్యూ కేసులు.. జర జాగ్రత్త..!

image

గ్రేటర్ HYDలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సీజనల్ వ్యాధులకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయాలని GHMC లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. మొత్తం 4,846 ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తిరగాలని, ఉన్నతాధికారుల సమక్షంలో వాటిని పరిశీలించి, దోమల ఆవాసాల్లో మందు పిచికారీ చేయాలని పేర్కొంది.

News July 2, 2024

HYD: లిఫ్ట్‌లో పడి పూజారి మృతి

image

ప్రమాదవశాత్తు లిఫ్ట్‌‌ కింద పడి పూజారి మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తుకారాంగేట్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహ్మ మూర్తి ఈస్ట్ మారేడుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పూజ చేయడానికి వెళ్లాడు. లిఫ్ట్‌‌ డోర్‌ తెరిచి అడుగుముందుకేశాడు. లిఫ్ట్ పై ఫ్లోర్‌లోనే ఆగిపోవడం గమనించకపోవడంతో కింద పడిపోయాడు. ఇదే సమయంలో లిఫ్ట్ అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

News July 2, 2024

HYD: ఎస్‌ఆర్‌నగర్‌లో యువతిపై అత్యాచారం

image

పెళ్లి సంబంధాలు చూసే యాప్ ద్వారా పరిచయమైన యువతిపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన SRనగర్‌‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన యువతి(27)కి పెళ్లి సంబంధాలు చూసే ఓ యాప్‌లో రాజశేఖర్(30) అనే యువకుడు పరిచయమయ్యాడు. 24న యువతికి ఫొన్ చేసి తన ఫొటో స్టూడియోకి పిలిచి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఉప్పల్ PSలో ఫిర్యాదు చేయగా.. SRనగర్‌కు కేసును బదిలీ చేశారు

News July 2, 2024

HYD: క్రికెట్ క్రీడాకారులకు GOOD NEWS

image

క్రికెట్ క్రీడాకారులకు HYD HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లా లెవెల్ స్టేడియాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులన్నీ పూర్తయ్యాయని, BCCIనుంచి ఫండ్స్ విడుదలైనట్లు తెలిపారు. ఆగస్టు8 నుంచి డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుందని,ఉమెన్స్ లీగ్ క్రికెట్ నిర్వహించేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధం చేశామని, తెలంగాణలో క్రికెట్ నూతన శకం ఆరంభం కాబోతుందన్నారు.

News July 2, 2024

HYD: FAST TAG లేకుంటే డబుల్ పెనాల్టీ..!

image

HYD శివారు నానక్‌రాంగూడ ఎగ్జిట్ నంబర్-19 వద్ద ORR పక్కన టోల్‌గేట్ నుంచి వెళ్లే వాహనదారులకు ఫాస్ట్ ట్యాగ్ లేకుంటే డబుల్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని చూసిన పలువురు వాహనదారులు, ప్రయాణికులు డబుల్ పెనాల్టీ ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

News July 2, 2024

HYD: తల్లిదండ్రులూ.. మీ పిల్లలు జర జాగ్రత్త..!

image

పిల్లలను ఎక్కువ సేపు సెల్ ఫోన్ వాడనీయొద్దని, దానికి అడిక్ట్ కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెల్‌ఫోన్ ఎక్కువుగా వాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పిల్లలు వెళ్లిపోయిన ఘటనలు తాజాగా HYDలో వెలుగు చూశాయి. సికింద్రాబాద్ వారాసిగూడలో ఈశ్వర్(14), తార్నాక లాలాపేట్‌లో సాయివాసవి(13), నల్లకుంటలో మరో బాలిక(14) ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

News July 2, 2024

RR: రూ.100 కోట్లతో టూరిజం అభివృద్ధి: ఎంపీ

image

VKB జిల్లాలో రూ.100 కోట్లతో అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రత్యేక జిల్లా సమావేశం నిర్వహించి, రూ.100 కోట్ల ప్రాజెక్టు పురోగతి పనులపై పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వికారాబాద్ జిల్లా తెలంగాణ టూరిజం హబ్‌గా అవతరిస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

News July 2, 2024

HYD: హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు జీవిత ఖైదు

image

హత్య కేసులో ముగ్గురు రౌడీషీటర్లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన వివరాలు.. దొమ్మరపోచంపల్లికి చెందిన ముజాహిద్ ఆలియాస్ ముజ్జు(50), నవాబ్ కుంటకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్(40) స్నేహితులు. ఇద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా గొడవలు అయ్యాయి. సయ్యద్ ఇస్మాయిల్‌ను ముజాహిద్ తన స్నేహితులు పాషా(25), ఫిరోజ్ ఖాన్(31)తో కలిసి హత్య చేశారు. నేరం రుజువు కాగా శిక్ష పడింది.

News July 2, 2024

HYD: పరీక్ష ల్యాబ్ లా నూతన భవనం ప్రారంభం

image

రాజేంద్రనగర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి రూ.790 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి, విత్తనాలు ఫర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ లా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ప్రారంభించారు. రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు, తమ భూముల సారవంతం తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు, రైతులు వాడే విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.