RangaReddy

News March 24, 2024

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం

image

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం చండీ హోమం వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ, పూజారులు చండీ హోమంను కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

News March 24, 2024

HYD: బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలానగర్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ పరిధి APHB కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఓ బస్సులో స్థానికంగా నివాసం ఉండే పులి ప్రణీత్ తేజ అనే యువకుడిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో నమ్మించి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2024

HYD: సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి: ఆర్.కృష్ణయ్య

image

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం HYD విద్యానగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, గవ్వల భరత్ పాల్గొన్నారు.

News March 24, 2024

మైనార్టీల ఇలాకా ‘హైదరాబాద్’ పార్లమెంట్

image

HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్‌ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

News March 24, 2024

HYD మెట్రో స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!

image

HYDలోని వివిధ మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్‌ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపి వేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 24, 2024

FLASH: HYD: డీజిల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

image

కర్ణాటక నుంచి HYDకు డీజిల్‌ను తరలిస్తున్న ముఠాను కోకాపేటలో శంషాబాద్ SOT పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్‌ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.

News March 24, 2024

అరబ్ వస్తువులకు కేరాఫ్ బార్కాస్ బజార్

image

హైదరాబాద్‌లోని ‘బార్కాస్’ అరబ్ సంస్కృతికి నిలయం. వహ్లాన్, బామ్స్, ఆవర్గీ, యాఫై, బహమాద్, కసేరీ తదితర కుటుంబీకులు ఇక్కడ నివసిస్తున్నారు. సూది, నెయిల్ కట్టర్, అత్తర్, టీవీలు, బుర్ఖా, ఖర్జూర్, ఉద్దాన్, షేవింగ్ కిట్, పాదరక్షలు ఇలా అతి చిన్న వస్తువులను ఇండోనేషియా, ఇటలీ తదితర దేశాల్లో తయారైనవే వినియోగిస్తుంటారు. బార్కాస్‌లోని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు లుంగీలు వాడతారు.

News March 24, 2024

HYD: సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్

image

హోలీ సందర్భంగా సమ్మతి లేకుండా రంగులు చల్లడాన్ని, వీధులు, వాహనాలపై గుంపులుగా సంచరించడాన్ని నిషేధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ ఆదేశాలిచ్చారు. ఈ నిబంధనలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతేగాకుండా నేడు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని చెప్పారు.

News March 24, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షల టోకరా

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్‌(40) ఆన్‌లైన్‌ ట్రేడర్‌. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

News March 24, 2024

అర్ధరాత్రి చలో చార్మినార్!

image

రంజాన్‌ సందడి మొదలుకావడంతో ఓల్డ్ సిటీ కిక్కిరిసిపోతోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రి జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు చలో చార్మినార్‌ అంటున్నారు. HYD వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు నగరానికి వచ్చిన వారు, విదేశీయులు రంజాన్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.