RangaReddy

News May 20, 2024

HYD: జూన్ 6 నుంచి నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్

image

47వ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్ జూన్ 6 నుంచి 8 వరకు HYD హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ఛైర్మన్, స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు వారు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌లో 26 రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు రానున్నారని తెలిపారు.

News May 20, 2024

HYD మెట్రో ట్రయల్ రన్.. టైమింగ్స్ మార్పు.!

image

HYD మెట్రో సమయ పాలనలో మార్పులు చేసేందుకు ముందస్తుగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారాల్లో మొదటి ట్రైన్ ఉదయం 5:30 గంటలకు, శుక్రవారాల్లో లాస్ట్ ట్రైన్ రాత్రి 11:45 గంటలకు మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, సాధ్య సాధ్యాలను పరిశీలించిన అనంతరం మాత్రమే దీనిని శాశ్వతంగా కొనసాగిస్తామని HYD మెట్రో X వేదికగా తెలిపింది.

News May 20, 2024

HYD: జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ

image

ఆస్తమా, ఉబ్బసం రోగుల కోసం ఏటా HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి జూన్ 8 నుంచి ప్రారంభమవనుందని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న ప్రవేశిస్తుందని,ఆ రోజు నుంచే ప్రసాదం పంపిణీ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని, త్వరలో ఈ విషయమై సీఎంను కలవనున్నట్లు తెలిపారు.

News May 20, 2024

HYD: ఏప్రిల్ 24న పెళ్లి.. ఇంతలోనే విషాదం

image

పెళ్లయిన 25 రోజుల్లోనే నవ వధువు మృతిచెందిన ఘటన HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్ ఆర్యనగర్‌ వాసి మౌనిక(26)కు చిలుకానగర్ వాసి రమేశ్‌కు ఏప్రిల్ 24న పెళ్లయ్యింది. శనివారం పుట్టింటికి భర్తతో కలిసి మౌనిక వచ్చింది. రాత్రి భర్త వెళ్లిపోగా ఆమె అక్కడే ఉంది. ఆదివారం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన మౌనిక బోర్ మోటార్ ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది.

News May 20, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

వారంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో నాట్య గురువు అంజలి శిష్య బృందం ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ నృత్యకారి, మూషికవాహన, రుక్మిణి ప్రవేశం, బ్రహ్మంజలి, పలుకే బంగారమాయేనా, పుష్పాంజలి, అలివేలు మంగ, కులుకగ నడవరో, నమశ్సివాయతే, గోవర్థన గిరిధర, జతిస్వరం, కృష్ణ శబ్దం, గోవిందా గోవిందా తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.

News May 20, 2024

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: డిప్యూటీ సీఎం

image

పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆకుపచ్చ జీవనం మనకు ఓ విధానంగా మారాలి, పచ్చని వారసత్వాన్ని మన తర్వాత తరాలకు అందించాలన్నారు. 50% నీరు, 40 శాతం విద్యుత్తు ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

News May 19, 2024

HYD: 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేశారు!

image

గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1.86 కోట్ల మంది ఓటేశారని, ఈసారి తెలంగాణ -2024 లోక్‌సభ ఎన్నికల్లో 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లుగా CEO వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినందుకు రాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో 50.78, చేవెళ్లలో 56.50, HYD 48.48, సికింద్రాబాద్‌లో 49.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.

News May 19, 2024

సికింద్రాబాద్: అగ్ని వీర్ ట్రైనింగ్ ప్రమాణాలపై తనిఖీ

image

సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న అగ్నివీర్ శిక్షణ ప్రమాణాలపై లెఫ్ట్ నుంచి జనరల్ మంజిత్ కుమార్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రం వద్ద ఉన్న అధికారులను కలిసి అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అగ్నివీర్లు అద్భుతంగా రాణించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించి శిక్షణ అందించాలని వారు ఆదేశించారు.

News May 19, 2024

HYD: పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి

image

పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. ఒకే రోజు యాలాల మండలంలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. జుంటుపల్లిలో రైతులు శ్రీనివాస్, లక్మప్పలు తమ వరి పంట కోయిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో సమీప చెట్టు కిందకి వెళ్లారు. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బెన్నూరులో సైతం రైతు గొల్ల వెంకన్న వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి మృతి చెందాడు.

News May 19, 2024

రాష్ట్రంలో 40-50% అగ్ని ప్రమాదాలు HYDలోనే!

image

జనవరి నుంచి ఏప్రిల్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,104 ఫైర్ కాల్స్ నమోదయ్యాయి. స్వల్ప ప్రమాదాల విభాగంలో 2,860, మధ్యస్థంగా 62, తీవ్రతర ప్రమాదాలు 9, రెస్క్యూ కాల్స్ 127, ఎమర్జెన్సీ కాల్స్ 15 ఉన్నాయని కమాండ్ కంట్రోల్ సిబ్బంది తెలిపారు. ఇందులో 40-50 శాతం ప్రమాదాలు HYD పరిధిలోనివే. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఛాంబర్ అగ్ని ప్రమాదంతో మొదలుకొని కాటేదాన్ సహా అంటూ.. రిపోర్టు విడుదల చేసింది.