India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,726 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,271 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,455 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్ ఈరోజు ఉదయం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా వైజాగ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ సిద్ధమయ్యాడు. అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి, అప్రమత్తమై గాల్లోకి లేపడంతో పెను ప్రమాదం తప్పింది.
HYDతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్చి మొదటి వారంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా 37.4 డిగ్రీలకు చేరింది. రాత్రి ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదు కాగా.. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
10 మార్చి 2011 యాదుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం భాగ్యనగరమంతా బారికేడ్లు.. పట్నమంతా పారామిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్ బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అదే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం వేసిన ప్రతీ అడుగూ ప్రత్యేక రాష్ట్ర సాధన కల నెరవేర్చుకునేందుకు సాకరమైంది.
ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
– నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.
– రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.
– దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
– ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలు తిరగకూడదు.
ఎల్బీనగర్‌లోని పలు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలువురు మండిపడుతున్నారు. కామినేని వద్ద లాడ్జీలు, హోటళ్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయని,అధికారులు నిఘా కరవవ్వడంతో ఆడిందే ఆటగా మారిందంటున్నారు. ORR, ఆటోనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడా, DSNR హైవేలపై రాత్రుళ్లు కొందరు అసభ్యకర దుస్తులతో నిలబడి సైగలు చేస్తూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని నివారించాలని కోరుతున్నారు.
కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న రైతు పౌల్ట్రీ ఫామ్‌లో పెద్ద సంఖ్యలో కోళ్ల మృతితో రైతు విచారం వ్యక్తం చేశారు. నానక్‌నగర్‌లో రైతు చల్లా కృష్ణారెడ్డి పౌల్ట్రీ ఫాంలో అనుకోకుండా ఒక్కసారిగా పదివేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు చనిపోవడంతో దాదాపు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ఎలాగైనా ప్రభుత్వం, అధికారులు తనను ఆదుకోవాలని కోరారు. గుంతలో కోళ్లను పూడ్చిపెట్టారు.
హైదరాబాద్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.
ఇటీవల అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి గంప ప్రవీణ్ మృతదేహం స్వగ్రామం షాద్‌నగర్‌లోని కేశంపేటకు చేరుకుంది. తానా సహకారంతో తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాగా కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు. గత మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరపగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.- నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.- బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.- రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.- దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.- ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తిరగకూడదు.
Sorry, no posts matched your criteria.