India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం తాగేందుకు రూ.50 కోసం గొడవ పడి గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. అల్వాల్ పోలీసుల వివరాలు.. మచ్చబొల్లారంలో నివాసముండే సురేశ్(45) పెయింటింగ్ పని చేస్తున్నాడు. సూర్యనగర్‌లో నివాసముండే భరత్‌ను 13న మద్యానికి డబ్బులు లేవని రూ.50 ఇవ్వాలని అడిగాడు.దీంతో తరచూ ఎందుకు అడుగుతున్నావని భరత్ గొడవకు దిగాడు. మాటమాట పెరిగి భరత్ సురేశ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సురేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.
లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. నగర పరిధిలోని 4 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 29 అసెంబ్లీ సెగ్మెంట్లకు 19 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.
GHMC విపత్తుల విభాగానికి వరద, చెట్లు కూలడంపై 82 ఫిర్యాదులు రాగా, డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 8 గంటల వరకు 65 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఉప్పల్, మలక్ పేట,చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా,గుడిమల్కాపూర్, షేక్ పేట, అసెంబ్లీ, ఎన్టీఆర్ స్టేడియం, కేబీఆర్ పార్క్, కేకే పార్క్ ప్రాంతాల్లో 18 వరకు చెట్లు నేలకూలాయి. 63 చోట్ల వరద నీరు నిలిచిపోయిన ఫిర్యాదులు వచ్చాయన్నారు.
స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రైపియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రతీ స్కానింగ్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఫొటోలు తీయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికను నమ్మించి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ RJNR ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. గచ్చిబౌలి పోలీసుల వివరాలు.. NGKL జిల్లాకు చెందిన సతీశ్ కుమార్(23) ఓ బాలిక(15)తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
మల్కాజిగిరిలో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. రాజశేఖర్ రెడ్డి(BRS)పై రేవంత్ రెడ్డి (INC) 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంచందర్ రావు(BJP) 3వ స్థానంలో నిలిచారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికలకు ముందు ఈటల (BJP), సునీత (INC), రాగిడి (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు తమదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా హామీలు ఇవ్వడం బాధాకరమని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. వారు అమలు చేయాలని చూసినా రాష్ట్ర ఖజానాలో నిధులు లేవన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్‌లో 201 కేసుల్లో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. దీంట్లో 192 కేసులకు సంబంధించి రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు.
బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే దేశంలో తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం HYD విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన 16వ బీసీ సంఘాల సమావేశం అనంతరం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా పేద – ధనిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.