India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ HYDలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మంత్రి లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
HYDలోని సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం యోగా, మధ్యాహ్నం ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం కోసం క్యాంపులో పాల్గొనవచ్చని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు వివిధ కళాకృతులను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
TDP ఆంధ్రప్రదేశ్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో జరిగిన గొడవల్లో పోలీసులు ప్రయోగించిన బాష్ప వాయువుతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కుటుంబీకులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం HYD అబిడ్స్ కాంచన హాస్పిటల్ వద్దకు ఆయన్ను తరలించారు.
BRS, కాంగ్రెస్ ఒక్కటే అని, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం BJPనే అని కేంద్ర మంత్రి, తెలంగాణ BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన ఈరోజు మాట్లాడారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించట్లేదని, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇవ్వట్లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు.
HYD ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియంలో SRH VS GT మధ్య మే 16న సా.7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. కీలక మ్యాచ్ కావడంతో ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న కొందరు సోషల్ మీడియా ద్వారా ఒక్కో టికెట్ రూ.2 వేల నుంచి రూ.5 వేల చొప్పున విక్రయిస్తూ బ్లాక్ దందాకు తెర లేపారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ఈ దందాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.
జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత హైదరాబాద్‌ను బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని KTR ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. HYDను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఛాన్సే లేదని స్పష్టం చేశారు.
ఓటు విలువను తెలియజేస్తూ చేపట్టిన SVEEP కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 2019 MP ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 3.26 శాతం ఓట్ల శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హైదరాబాద్: 2019-44.75%, 2024-48.48% నమోదు.
సికింద్రాబాద్:2019-46.26%, 2024-49.04% నమోదు.
మల్కాజిగిరి:2019-49.63%, 2024- 50.78% నమోదు.
చేవెళ్ల: 2019-53.25% 2024-56.50% నమోదైంది.
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని పరిశీలించారు. హత్యకు గురైంది చార్మినార్ ప్రాంతానికి చెందిన మక్సూద్ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న సౌత్ జోన్ DCP స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.
సికింద్రాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ గెలిస్తే ఆ పార్టీదే దేశంలో అధికారమని సెంటిమెంట్. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. సాయికిరణ్(BRS)పై కిషన్ రెడ్డి(BJP) 62,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంజన్ కుమార్(INC) 3వ స్థానంలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల ముందు BJP, BRS, INC నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. HYDలో 48.48%, సికింద్రాబాద్‌లో 49.04%, మల్కాజిగిరిలో 50.78%, చేవెళ్లలో 56.40% నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 51.61% పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రాజధాని పరిధిలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 3 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.
Sorry, no posts matched your criteria.