India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఉప్పల్ భరత్ నగర్ ప్రాంతానికి చెందిన గట్టు విజయలక్ష్మి స్థానిక ఆంధ్ర యువత మండలి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ స్టేషన్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే పోలింగ్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించగా గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు కేంద్రానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
1. కూకట్‌పల్లి-25.12
2. ఎల్బీనగర్-26.74
3. మల్కాజిగిరి- 21.70
4. కుత్బుల్లాపూర్-28.36
5. సికింద్రాబాద్ కంటోన్మెంట్-29.03
6. ఉప్పల్- 26.25
7. మేడ్చల్-34.90
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని కోరారు.
✓1. చేవెళ్ల- 43.1
✓2. మహేశ్వరం- 31.84
✓3. పరిగి- 43.57
✓4. రాజేంద్రనగర్- 31.49
✓5. శేర్లింగంపల్లి- 27.49
✓6. తాండూరు- 41.05
✓ 7. వికారాబాద్ – 45.16
సికింద్రాబాద్ పరిధి గోపాలపురంలో ఉన్న St.ప్యాట్రిక్ స్కూల్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.1 గంట వరకు HYDలో 19.37, మల్కాజిగిరిలో 27.69, సికింద్రాబాద్ 24.91, చేవెళ్ల 34.56 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 29.03 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. HYDలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
HYD బంజారాహిల్స్ NBT నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తన తండ్రి కేశవరావుతో కలిసి ఓటు వేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటరు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావాలని కోరారు.
సికింద్రాబాద్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. మోండామార్కెట్‌లోని ఇస్లామీయ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 తర్వాత పద్మారావు తన ఓటు తానే వేసుకోవడం విశేషం. ఆయన నివాసం పక్కా సికింద్రాబాద్ అయినప్పటికీ.. మోండా మార్కెట్ సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తోంది. ప్రస్తుతం ఆయన MP అభ్యర్థిగా నిలవడంతో ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్‌నగర్, షాద్‌నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తాము ఓటేసేందుకు వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.