India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమన్నారు.
2 వారాల సెలవు ముగించుకుని కమిషనర్ రోనాల్డ్ రాస్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు GHMC తెలిపింది. ఉదయం 10:30 నుంచి ఉ.11:30గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు 040-23222182 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలపాలని అధికారులు తెలిపారు. అనంతరం ప్రజావాణికి హాజరైన నగర వాసుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంత్రి కొండా సురేఖ, మరో 16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ శనివారం HYDలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం కమిటీ మూడు సమావేశాల్లో ఆయా టూరిజం స్పాట్స్‌ను గుర్తించాలని సూచించింది. ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను రూ.25 కోట్లకు పెంచాలని భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్ గాజుల అంజయ్య కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో బోనాల బడ్జెట్ రూ.15 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఛైర్మన్ చెరుకు రాంచందర్ అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. మాదిగ జాతిని, వారి ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.
HYD గచ్చిబౌలిలోని సాట్స్ షూటింగ్ రేంజ్‌లో 10వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్‌సంగి ప్రారంభించారు. ఈ పోటీల్లో 10ఎం రైఫిల్ ఓపెన్/సైట్ రైఫిల్, 25ఎం ఫిస్టల్, 50ఎం ఫిస్టల్, 10ఎం ఫిస్టల్ ఈవెంట్‌లలో 200 మందికి పైగా పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
HYD మణికొండలోని చిత్రపురికాలనీలో రాజేశ్వరిపై <<13490170>>15 కుక్కలు దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు మాట్లాడుతూ.. ‘ఒక్కసారిగా నాపై అన్ని కుక్కలు దాడి చేశాయి.. చాలా భయపడ్డాను.. ప్రాణాలతో బయటపడుతానని అనుకోలేదు.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో వాటిని కొడుతూ రక్షించుకోగలిగాను. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డాను. చేతిపై ఓ కుక్క కరిచింది. కింద పడడంతో గాయాలయ్యాయి. HYDలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది’ అని అన్నారు.
రానున్న రోజుల్లో భారీవర్షాలు ఉండొచ్చన్న వాతావరణశాఖ అంచనాలతో GHMC సన్నద్ధమైంది. రోడ్లపై నీరు నిలిచినప్పుడు, వరదను దారి మళ్లించే స్టాటిక్ బృందాలు, వరదనీటి సమస్యను పరిష్కరించే సంచార బృందాలు తాజాగా రంగంలోకి దిగాయని ఇంజినీరింగ్ విభాగం తెలిపింది. ముంపు నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించడమే ధ్యేయంగా ఇంజినీరింగ్ విభాగం 168 నీటిని తోడేమోటార్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లోనే మరో మర్డర్ జరిగింది. పాతబస్తీలోని నవాబ్‌సాహెబ్‌కుంట అచ్చిరెడ్డినగర్‌లో మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. జాకీర్ హుస్సేన్‌ను బంధువులే హత్య చేసినట్లు తెలుస్తోంది.
గ్రేటర్‌లో BRSను వీడేందుకు MLAలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. MP ఎన్నికల ముందు మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడారు. ఇటీవల ఒక్కరిద్దరు BRS MLAలు మంత్రులను కలిశారు. దీనికితోడు కాంగ్రెస్‌లోకి రావాలని ఇటీవల దానం నాగేందర్ ఓపెన్ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక పార్టీ మారే MLAలు ఎవరనేది తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.