RangaReddy

News August 29, 2024

HYD: దుర్గం చెరువులోని 204 భవనాలకు ‘హైడ్రా’ నోటీసులు

image

‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

News August 29, 2024

HYD: విమానం అత్యవసర ల్యాండింగ్.. దక్కని ప్రాణాలు

image

విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్‌లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News August 29, 2024

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించారు. ఉప్పల్ డీఐగా రామలింగారెడ్డిని, పహడీ షరీఫ్ డీఐగా దేవేందర్, మాడ్గుల సీఐగా జగదీష్, ఎల్బీనగర్ సీఐగా వినోద్ కుమార్, తదితరులకు పోస్టింగ్ ఇచ్చారు.

News August 29, 2024

HYD: ఓయూలో రూ.23 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

image

ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.

News August 29, 2024

HYD: జీహెచ్ఎంసీలో భారీగా బదిలీలు

image

జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీల ప్రక్రియలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ల నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల వరకు భారీ సంఖ్యలో బదిలీలు చేశారు. బదిలీ అయిన వారిలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అడిషనల్ మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. వీరిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి బదిలీ చేశారు.

News August 29, 2024

ఓయూ పీజీ పరీక్షలు 19కి వాయిదా

image

ఓయూ పరిధిలో జరగనున్న పీజీ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు వచ్చేనెల 19కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలను యుజిసి నెట్, టిఎస్ సెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

News August 29, 2024

HYD: డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దగ్గర పడుతున్న గడువు!

image

HYDలోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్సిటీలో దూర విద్యలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆగస్టు 31న ఈ గడువు పూర్తి కానుంది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, కోర్సులు ఉన్నట్లు ప్రొఫెసర్ కోటేశ్వరరావులు, డా.వీరన్న తెలిపారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

రాష్ట్రంలోనే HYD జిల్లాలో అత్యధిక MSME యూనిట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా HYD జిల్లాలో MSME యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 1,68,077 MSMEలు ఉంటే.. ఇందులో 1,33,937 యూనిట్లు సర్వీస్ విభాగంలో ఉన్నాయి. మిగతా 34,140 యూనిట్లు ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఇందులో సూక్ష్మ సంస్థలు అత్యధికంగా 1,56,642 యూనిట్లు పనిచేస్తున్నాయి. చిన్న తరహావి 9,813, మధ్య తరహావి 1,622 దాకా ఉన్నాయని అధికారులు తెలిపారు.

News August 28, 2024

HYD: మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఖరారు!

image

మూసీనదికి 50 మీటర్ల బఫర్ జోన్ సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు NOC పత్రాలు జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ HYD పరిధిలో మూసీకి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు LOCల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. బఫర్ జోన్ నిర్ణయంతో.. మూసికి 50 మీటర్ల సరిహద్దు వరకు నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలో కూల్చివేయనున్నారు.