India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైలు బదిలీలు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తాజాగా జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే 27 మంది ఎస్ఐలు బదిలీలు అయ్యారు. చాలా రోజుల నుంచి ఒకే ఏరియాలో ఉన్న పోలీసులతోపాటు ఎన్నికల సమయంలో బదిలీలు అయిన ప్రాంతాల్లో ప్రస్తుతం బదిలీలు చేశామని చెప్పారు.
పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సరూర్‌నగర్ PS పరిధి హుడానగర్‌లో ఉండే M.లక్ష్మణ్ 2018లో ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. లక్ష్మణ్‌కు 10ఏళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమానాను నేడు కోర్టు విధించింది. అలాగే రూ.2లక్షలు నష్టపరిహారం బాధితురాలికి అందించాలని పేర్కొంది.
HYD, RR, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో గతేడాదితో పోలిస్తే ప్రవేశాల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో 22 ప్రభుత్వ కాలేజీల్లో గతేడాది 8 వేల మందికిపైగా విద్యార్థులు చేరగా ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే 6వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య వేగంగా పెరుగుతోందని హైదరాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు.
లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్‌గా ఈరోజు దొరికాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సీఐ వెంకటేశం ఓ కేసు పరిష్కారం విషయమై రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ మేరకు సూరారం పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉందని ప్రతి పక్షాలను శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రశ్నించారు. శుక్రవారం HYD హిమాయత్‌నగర్‌లోని పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడం సరికాదని సూచించారు. విద్యార్థులకు నష్టం చేసే లీకేజీ వ్యవహారాలను ప్రధాని సహించరని అన్నారు.
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో వారి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీతో పాటు పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
కాంగ్రెస్ నేత, చొప్పదండి MLA మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో ఈరోజు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా HYD జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు గాంధీ ఆసుపత్రిని సందర్శించి పోస్టుమార్టం నిర్వహించే మార్చురీ వద్ద డాక్టర్లతో మాట్లాడారు. నిన్న రాత్రి MLA భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు హీరో నవీన్ చంద్ర పాల్గొన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, షూటింగ్ ఉన్నా.. ప్రతిరోజు 20 నిమిషాలు యోగాకు కేటాయిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల బ్యాలెన్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.
HYD నగరం సహా శివారు జిల్లాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తనిఖీలను మరింత వేగవంతం చేసి, కఠిన చర్యలను తీసుకొని, అమలు చేసే విధంగా ప్రత్యేక మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటి కానుంది. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాలపై కేబినెట్ చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చ.. కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చెయ్యనుంది. రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పర్యటించి అధ్యయనం చేసిన అధికారులు, విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరంపై మాట్లాడతారు.
Sorry, no posts matched your criteria.