India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం, ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ HYD, రాచకొండ పోలీసు కమిషనర్లు గురువారం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ రోజైన 13న ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ ఉద్యోగుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశీయంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన 3 విమానాలు, వారణాసి, విజయవాడ, గ్వాలియర్, సూరత్, లక్నో, బెంగళూరు, గోవా, కొచ్చిన్, పుణేకు వెళ్లాల్సిన 12 విమానాలు ఇక్కడి నుంచి బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రేమ పెళ్లి అంటూ యువతిని లోబర్చుకుని మోసం చేసిన ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన యువతి, నల్గొండ జిల్లాకు చెందిన మధు చైతన్యపురిలో కోచింగ్ తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడు.దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT
CM రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు ఎన్నికల అధికారిని గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వం, హిందూ విశ్వాసాలు, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతా మాతపై విమర్శలు చేయడం VHP తప్పుబడుతోందన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య శ్రీరామజన్మభూమి అక్షింతలను అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
HYD చాలా సున్నితమైన ప్రాంతమని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఛానెల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లు పాలించిన TDP, కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు హైదరాబాద్‌లో మత కల్లోహాలు లేకుండా కాపాడాయి. ఈ రోజు BJP ఇక్కడ నాలుగు సీట్లు గెలవడం కోసం మైనార్టీల్లో, మెజార్టీ వర్గాల్లో అభద్రత, భయాన్ని రేకెత్తించడం ఎంతవరకు సమంజసం? పెట్టుబడులను గుజరాత్ తరలించడానికే BJP కుట్ర చేస్తోంది’ అంటూ CM ఆరోపించారు.
MP ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, మాధవీలతకు మద్దతుగా ఆయన ఎల్బీస్టేడియంలో BJP జనసభలో ప్రసంగిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సా. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీస్టేడియం చుట్టూ ఆంక్షలు విధించారు. BJR విగ్రహం, AR పెట్రోల్ పంప్ దారి మూసివేస్తారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
HYD అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని CM రేవంత్ అన్నారు. గురువారం సరూర్‌నగర్ జనజాతరలో ఆయన ప్రసంగించారు. ‘నగరం ప్రశాంతంగా ఉంది. IT, ఫార్మా కంపెనీలను కాంగ్రెస్ తీసుకొచ్చినందుకే విశ్వనగరంగా పేరు వచ్చింది. అటువంటి హైదరాబాద్‌లో BJP విషం చిమ్మాలని చూస్తోంది. మతం పేరుతో రాజకీయం చేస్తోంది. ఇలా అయితే పెట్టుబడులు వస్తాయా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయా’ అనేది ప్రజలు ఆలోచించాలని CM సూచించారు.
లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంక్షలు విధిస్తున్నట్లు CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. ట్విన్ సిటీస్‌లో 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్బులు, క్లబ్బులు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఈ 48 గంటలు ప్రచారం కూడా చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. SHARE IT
HYD పరిధిలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 45కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ నుంచి మహారాష్ట్రకు, కాటేదాన్ నుంచి కర్ణాటకకు, జీడిమెట్ల, వనస్థలిపురం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న టన్నుల కొద్ది రేషన్ బియ్యం సీజ్ చేశారు. అత్తాపూర్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా గోదాంలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు నిఘా పెట్టారు.
Sorry, no posts matched your criteria.