India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD పరిధిలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 45కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ నుంచి మహారాష్ట్రకు, కాటేదాన్ నుంచి కర్ణాటకకు, జీడిమెట్ల, వనస్థలిపురం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న టన్నుల కొద్ది రేషన్ బియ్యం సీజ్ చేశారు. అత్తాపూర్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా గోదాంలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు నిఘా పెట్టారు.
బ్యాలెట్ యూనిట్ పై అభ్యర్థులందరి తర్వాత చివరి వరుసలో NOTA అని ఉంటుంది. సాధారణంగా నోటాకి ఓటు వేస్తే ఏం లాభం అని అనుకుంటారు. కానీ.. గత ఎంపీ ఎన్నికల సమయంలో మల్కాజిగిరి అభ్యర్థి గెలుపోటముల్లో కీలకపాత్ర పోషించిన NOTA తన సత్తా చూపి నేనేం తక్కువ కాదని నిరూపించింది. BRS అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజార్టీతో గెలవగా.. అదే నోటాకు 17,895 ఓట్లు వచ్చాయి.
HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ప్రాంతాల్లో 80 శాతం ఓటింగ్ నమోదయ్యేలా అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 2019లో HYDలో 45.8, సికింద్రాబాద్-48.9 మల్కాజిగిరి-53.4, చేవెళ్ల-56.9 శాతం ఓటింగ్ నమోదైంది. 2014తో పోలిస్తే సరాసరిగా 6 శాతం మేర ఓటింగ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ఓటేసి మనమేంటో చూపిద్దాం. మే 13న తరలిరండి అంటూ..SVEEP అధికారులు పిలుపునిచ్చారు.
HYD యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో <<13213121>>14 ఏళ్ల బాలికను<<>> వ్యభిచారం రొంపి నుంచి పోలీసులు కాపాడిన విషయం తెలిసిందే. బాలిక మాట్లాడుతూ.. నిర్వాహకురాలు చిన్నప్పుడే తనను తీసుకొచ్చి పెంచిందని, ఏడాది నుంచి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించిందని తెలిపింది. తాను ఒప్పుకోకపోతే తీవ్రంగా కొట్టి , తాడుతో కట్టేసి, మాట వినలేదని జుట్టు మొత్తం కత్తిరించిందని ఏడుస్తూ చెప్పింది. పోలీసులు బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
డిప్లొమా చేసినవారికి రెండు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన HYD బాలానగర్ CITD ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నోటీస్ విడుదలైంది. డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మేకింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులని తెలిపారు. CNC మిల్లింగ్ ఆపరేటర్, టర్నింగ్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గలవారు https://forms.gle/zeFFXwpBZkuojgaWA ద్వారా ప్లేస్‌మెంట్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
HYD యూసుఫ్‌గూడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు..కృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లి దాడి చేశారు. ఇద్దరు యువతులు,ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో 14ఏళ్ల బాలిక ఉండగా నిర్వాహకురాలు లక్ష్మిని విచారించారు. చిన్నప్పుడే బాలికను తీసుకొచ్చి పెంచి, బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపినట్లు తెలిపింది. చిన్నారిని రక్షించారు.
HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీశ్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు.
పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మినార్ బస్ స్టాండ్ పార్కింగ్‌లో డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వారికి నిషేధిత టైడోల్ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న యాకుత్‌పురకు చెందిన హర్షద్ ఖాన్‌ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద 100కి పైగా ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన మెదడుపై ప్రభావం చూపి మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.
సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా BRS పార్టీ గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 BRS, ఒకటి MIM గెలిచింది. ఇక మల్కాజిగిరిలో 7కు 7 BRS గెలిచింది. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నా ఎంపీలుగా మాత్రం గెలవలేదు. మరి ఈసారి 2ఎంపీ నియోజకవర్గాల్లోనూ BRS గట్టిగా ఉంది. పార్టీని గెలిపించేందుకు KCR, KTR ప్రచారం చేస్తున్నారు. మీ కామెంట్?
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.6.5 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగరానికి చెందిన గృహిణి(64) ఫేస్ బుక్‌లో ట్రేడింగ్‌లో మంచి లాభాలు వస్తాయనే ప్రకటన చూసి ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొదటగా కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.6.50 లక్షల వరకు యాప్‌లో పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చిన విత్ డ్రా చేసుకోవడానికి రాకపోవడంతో మోసపోయి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.